International

Brazil : బ్రెజిల్ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ.. నాలుగోసారి అధ్యక్షుడిగా లూలా..!

రచన: Kumar••5 నిమిషాల పఠనం

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఘన విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన రన్ ‌ఆఫ్ ఫైట్‌లో రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సనారో‌ను ఓడించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఘన విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన రన్ ‌ఆఫ్ ఫైట్‌లో రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సనారో‌ను ఓడించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో వెనుకబడిన లూలా డి సిల్వా.. ఎన్నికల ప్రచారంలో కార్మిక వర్గం, జీవన వ్యయం, ప్రజారోగ్య, ఆర్థిక సమస్యలపై దృష్టి సారించారు. దాంతో ప్రజలు మరోసారి లూలాకు పట్టం కట్టారు.

బ్రెజిల్ దేశ అధ్యక్ష ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో ప్రజారవాణా నిలిచిపోవడం, భారీ వర్షాల కారణంగా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలింగ్ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించాల్సి వచ్చింది. ఉత్కంఠ భరింత సాగిన ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లూలా 51.79 శాతం ఓట్లు సాధించగా, ఫ్లావియో బోల్సనారో 48.21 శాతం ఓట్లు పొందారు. 88 ఏళ్ల వయసులో లూలా నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

వీధుల్లో సంబురాలు.. సిల్వా ప్రస్థానం..

బ్రెజిల్ ఎన్నికల్లో లూలా డి సిల్వా నాలుగోసారి అధ్యక్షుడిగా విజయం సాధించడంతో వీధుల్లో ఆయన మద్దతుదారులు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, కార్మిక ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన లూలా గతంలో 2003 నుంచి 2010 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనపై నమోదైన అవినీతి కేసుల్లో శిక్షలు పడటంతో జైలుకు వెళ్లారు. సంబంధిత కోర్టు తీర్పులు రద్దు కావడంతో ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశం లభించింది. 2023లో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.ఆయన గత పాలనలో సంక్షేమ పథకాల విస్తరణ,పేదరిక నిర్మూలనకు తీసుకున్న చర్యలు ప్రజల్లో ఆదరణ పొందాయి.

పార్లమెంటులో లూలాకు మరిన్ని సవాళ్లు..

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను నియంత్రించేందుకు ప్రస్తుత అధ్యక్షుడి ప్రభుత్వం ప్రయత్నించి సక్సెస్ అయ్యింది.దీంతో ఆయన నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, తదుపరి పాలనలో లూలాకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్రెజిల్ పార్లమెంట్‌లో సంప్రదాయవాద, రైట్ వింగ్ పార్టీలకు గణనీయమైన ప్రాతినిధ్యం ఉండటంతో ప్రభుత్వ విధానాలకు ఆమోదం పొందడం అంత సులభం కాకపోవచ్చు. జైర్ బోల్సోనారోకు చెందిన లిబరల్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు పార్లమెంటులో బలంగా ఉండటంతో కీలక నిర్ణయాల అమలులో రాజకీయ చర్చలు, సంప్రదింపులు అవసరం కానున్నాయి. దీనికి తోడు దేశ ఆర్థిక లోటు, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ రుణభారం, రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు లూలా ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

#Brazil#president elections#lula da silva#won#international#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి