Samyuktha: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బికే112 త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం, బాలయ్య 'దాదా' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా పూర్తి చేస్తూనే కొరటాల సినిమాకి షిఫ్ట్ కానున్నాడు. అయితే, ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మేనన్ ఎంపికైందని తాజా సమాచారం.
నాలుగు భాషల్లో బిజీ హీరోయిన్:
సంయుక్త మీనన్ 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటోంది. సంయుక్త చేసిన సినిమాలలో ఎక్కువగా హిట్స్ ఉండటం వల్ల మేకర్స్ కూడా ఆమెకి అవకాశాలివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, తెలుగులో మంచి ఆదరణ ఉన్న సంయుక్త..జెట్ స్పీడ్‌లో మాత్రం సినిమాలను చేయలేకపోతోంది.
మరోసారి బాలయ్యకి జంటగా!
అఖండ 2లో నందమూరి బాలకృష్ణకి జంటగా నటించింది. అయితే, ఈ సినిమాలో సంయుక్తది హీరోయిన్‌కి తక్కువ..గెస్ట్ రోల్‌కి ఎక్కువ..అన్నట్టు ఉంటుంది ఆమె పాత్ర. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో పాత్ర నిడివి ఉండకపోవడం కాస్త మైనస్ అని చెప్పాలి. అందుకే, మరోసారి బాలయ్య సినిమాలో ఛాన్స్ అనగానే..ఈసారైనా క్యారెక్టర్ బలంగా ఉంటుందా? అని మాట్లాడుకుంటున్నారు. సంయుక్త ఫిజిక్ చూస్తే బాలయ్య లాంటి సీనియర్ హీరోలకి పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మరి, కొరటాల ఈ బ్యూటీనికి ఎన్‌బికే 112 కోసం ఫైనల్ చేశాడా లేదా తెలియాల్సి ఉంది.
సంయుక్త చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్:
రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న రాపో 23లో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం, షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలోనే అప్‌డేట్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న స్లమ్ డాగ్ లోనూ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు గనక హిట్ సాధిస్తే తెలుగులో ఇంకా క్రేజ్ రెట్టింపు అవుతుంది. ఇవి కాకుండా ఇతర భాషలలో మరికొన్ని సినిమాలను చేస్తోంది ఈ మలయాళ భామ.


