సినిమా

Vishwambhara: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా..నెక్స్ట్ సినిమాతో ఆయన అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు చిరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్, సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వాస్తవానికి ఈ సినిమాను ఏడాదిలోపే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, దర్శకుడికి సరైన అవగాహన లేకపోవడంతో వీఎఫెక్స్ వర్క్ నెలలు గడుస్తున్నా పూర్తికాక.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని, తేలని పరిస్థితి. గత ఏడాది మొత్తం 2026 సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ అని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్లేస్‌లో అనిల్ రావిపూడితో చేసిన మన శమంకరవరప్రసాద్‌గారు వచ్చి భారీ హిట్ సాధించింది.

అప్పటి నుంచి.. మార్చ్ అన్నారు, సమ్మర్ అన్నారు, దసరా బరిలో దింపుతామన్నారు. కట్ చేస్తే..ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అంటున్నారు. అంటే, 2027 జనవరిలో కాకా వచ్చే డేట్ ని విశ్వంభరకి ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు, ఈ సినిమా ఏ స్టేజ్‌లో ఉందో కూడా మేకర్స్ నుంచి క్లారిటీ, కన్‌ఫర్మేషన్ రావడం లేదు. సినిమా అప్‌డేట్స్ అయినా వస్తూ ఉంటే అభిమానుల్లో, మార్కెట్‌లో ఓ అంచనా ఏర్పడుతుంది.

మెగా అభిమానులకి పండుగే!

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కాకా షూటింగ్ కాస్త డిలే అవుతుందట. సంక్రాంతికి డేట్ లాక్ చేసిన ఈ సినిమాను సమ్మర్‌కి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అందుకే, ఆ డేట్‌కి విశ్వంభర రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ, బాబీ ఒక డేట్ చెప్పాడంటే.. ఆ డేట్ కి సినిమాను తెచ్చేస్తాడు. మరి, ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక, సంక్రాంతికి కాకా వచ్చినా, విశ్వంభర వచ్చినా మెగా అభిమానులకి పండుగే.

#Megastar Chiranjeevi#Vishwambhara#Trisha#Mallidi Vasishtha#Kaaka
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి