టాప్ న్యూస్

TG : కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?

రచన: Kumar5 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రికి ఎదురు తిరిగితే అంతే సంగతులు అన్నట్లుగా రాష్ట్రంలో ఒకేసారి వాతవరణం మారిపోయింది. కొండా సురేఖ మొదటి నుంచి ఇంతే అన్నట్లుగా చిత్రీకరించడంతో ఆమెకు సానుభూతి రాలేదన్నట్లుగా కనిపిస్తుంది. ఆనాడు జగన్‌ను నమ్ముకుని రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం పొందలేదు. ఆస్తుల విషయంలో ఇద్దరికి చెడిందనే ఆరోపణలు ఉన్నాయి.

- బీఆర్ఎస్,కాంగ్రెస్ సోషల్ మీడియా ఆడేసుకుంది

- గల్లీ నుంచి ఢిల్లీ దాకా శత్రువులను పెంచుకున్నారా?

- వరంగల్ గల్లీలో వర్గపోరు,మిత్రపోరు?

- అధిష్టానం పైనే అధారపడం,ఎదురు తిరగడం అలవాటు?

- ఆనాడు జగన్,కేసీఆర్,ఇప్పుడు రేవంత్‌పై అదే తీరు?

- ప్రజల అండ, రెండు బలమైన బీసీ కుటుంబాలు, బొలెడంత ఆస్తి?

- అయినా వాళ్ల వర్గాల్లో కనీస సింపతీ కనిపించడం లేదు?

- నిజంగా సొంత నియోజకవర్గాల్లో ప్రజల అండ పుష్కలంగా లేదు

- ఉంటే వెంటనే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసేవారు కదా అంటూ విమర్శలు?

- కయ్యాల కాంగ్రెస్‌లో మరోసారి పైచేయి సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?

- సురేఖ దెబ్బతో మంత్రులు సైలెంట్ అవుతారా?

- ఆమెలాగా అవమానం పడుతున్న వారు ఎదురు తిరుగుతారా?

- నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

నేడు కొండా.. రేపు ఎవరు?

ముఖ్యమంత్రికి ఎదురు తిరిగితే అంతే సంగతులు అన్నట్లుగా రాష్ట్రంలో ఒకేసారి వాతవరణం మారిపోయింది. కొండా సురేఖ మొదటి నుంచి ఇంతే అన్నట్లుగా చిత్రీకరించడంతో ఆమెకు సానుభూతి రాలేదన్నట్లుగా కనిపిస్తుంది. ఆనాడు జగన్‌ను నమ్ముకుని రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం పొందలేదు. ఆస్తుల విషయంలో ఇద్దరికి చెడిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పెద్దఎత్తున వైఎస్ బినామీగా ఉన్నారని టాక్. అందుకు జగన్ రూ.200 కోట్ల ఆస్తిని తీసేసుకోవడంతో అక్కడ లింకులు పోయాయని తెలిసింది.ఎంతో ఉండాల్సిన ఆప్యాయత కనిపించలేదు. ఇక కేసీఆర్ చేరదీసినా అక్కడ ఇంటి పోరుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దయాకర్ రావు రాగానే పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. జిల్లా రాజకీయాల్లో ఇమడ లేక నిత్యం వారి ఉనికి కోసమే ఫైటింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ చివరకు కేసీఆర్‌పై ప్రెస్‌మీట్ పెట్టి బయటకు వచ్చారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చి ధర్నాలు చేయాలి.మంత్రి పదవి తొలగిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోరుబాటకు సిద్ధం కావాలి.కానీ,ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. కొండా మురళి మాత్రం కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చు పెడుతానని చెప్పడం, రేవంత్‌ని ఓడిస్తామని అనడం విడ్డూరంగా ఉంది.

మంత్రులు దారికి వస్తారా? పోరు పెరుగుతుందా?

రేవంత్ వద్దు అనుకుంటే కేసీఆర్ కంటే ఎక్కువగా దూరం పెడతారు. మంత్రులను గంటల తరబడి కూర్చొబెట్టి చివరికి నిమిషంలో కలిసి వెళ్లిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఎంతోమంది మంత్రులకు దీనిని ఎదుర్కొన్నారు. వాళ్ల ముందే ఎమ్మెల్యేలు గల్లా ఎగరేసుకుని లోపలికి వెళ్లి వచ్చిన ఘటనలు ఉన్నాయి. మంత్రుల శాఖల్లో ప్రైవేట్ సైన్యం ఎలాగూ వేలు పెడుతునే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మిగతా మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

#konda sureka#congress#politics#no sympathi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి