Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్‌టిర్ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా డ్రాగన్ (ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే). కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఆలియా భట్, షాహిద్ కపూర్ కూడా కనిపించబోతున్నారట.
ప్రశాంత్ నీల్ సినిమా అంటే సౌత్ స్టార్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సీనియర్ నటులు కూడా ఉంటారు. కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటులు రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి చిత్రాలలో బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు. దీనివల్ల సినిమా అక్కడ కూడా మంచి మార్కెట్, బిజినెస్ జరుగుతాయని హోప్స్. ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ కూడా అదే.
వాస్తవానికి ఎన్‌టిర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చేసిన వార్ 2 ఆశించినంతగా సక్సెస్ సాధించలేదు. బాలీవుడ్ డెబ్యూ మూవీపై తారక్ ఎన్నో అంచనాలు పెట్టుకుంటే అవన్నీ తారుమారయ్యాయి. దాంతో, మళ్ళీ హిందీలో స్ట్రైట్ సినిమా చేయాలంటే ఆలోచిస్తున్నాడు. కానీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ మూవీ కోసం మాత్రం అక్కడ స్టార్స్‌ని తీసుకునేలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ ప్లాన్ లో భాగంగా షాహిద్, ఆలియా పేర్లు వినిపిస్తున్నాయి.
ఆలియా, షాహిద్ గెస్ట్ రోల్స్?
డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్.. ఆలియా భట్, షాహిద్ కపూర్‌లను తీసుకోవాలని చూస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆలియా మన సౌత్ ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఈ సినిమా కోసం రాజమౌళి భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టు చెప్పుకున్నారు. ఇక, తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన అర్జున్ రెడ్డి, హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ నటించి లైఫ్‌లో భారీ సక్సెస్ అందుకున్న హీరోగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఎన్‌టిర్ తో డ్రాగన్ కోసం చేతులు కలుపుతున్నారనేది మీడియాలో ప్రసారమవుతున్న తాజా వార్త. చూడాలి, మరి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.










