- ప్రతిపక్షాల ఉద్యమాలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- కాలుకు బలపం కట్టుకుని నేనున్నానంటూ బీఆర్ఎస్ భరోసా
- నియోజవర్గాల్లో విస్తృతంగా తిరిగిన హరీశ్ రావు
- తన ఎంపీ స్థానంలోనే అత్యధికంగా భూమి ఉండటంతో ప్రజలకు ధైర్యం చెప్పిన ఈటల
- ఒక్కొక్కటిగా ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తీసివేస్తున్న ప్రభుత్వం
- హరీశ్ రావు హెచ్చరించిన ఏరియాలన్నిటిలో తొలగింపు
- గద్దె దింపుతామంటే కాని దారికి రాని మంత్రుల వ్యవహారం?
- మంచి ఉద్దేశమే అయినా తొందరపాటుతో బద్నాం అవుతున్న రేవంత్ సర్కార్
- రైజింగ్ స్టేట్‌లో రోజురోజుకు ఎక్కువ డ్యామేజ్ అవుతున్న రెవెన్యూ డ్రైనేజ్ పనులపై ప్రతిపక్షాలు సాధించిన విజయంపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
రెవెన్యూ సబ్జెక్ ఓ సముద్రం.. తన వరకు వస్తే కాని అర్ధం కాదు?
తెలంగాణలో భూ వివాదాలు ఓ పట్టున అర్ధం కావు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. ఇరుక్కుంటే దివాలా తీస్తారు. అలాంటి భూములపై నేరుగా సర్కారే ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎలాంటి తప్పులు దొర్లని 14 లక్షల 25 వేల ఎకరాల భూములను ప్రొహిబిటెడ్‌లో పెట్టింది. దీంతో ప్రతి జిల్లాలో 40 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు నిషేధంలోకి వెళ్లాయి. ఒక్క పటాన్ చెరులోనే 50 వేల ఎకరాలు ఉండడంతో హరీశ్ రావు పెద్ద ఎత్తున వెంటనే రియాక్ట్ అయ్యారు.
నియోజకవర్గాల వారీగా బాధితుల గోడు వినేందుకు రంగంలోకి దిగారు. జనతా గ్యారేజీ అంటూ తెలంగాణ భవన్‌లో ఏ చిన్న వ్యక్తి వచ్చి భూ సమస్య చెప్పుకున్నా ఒపికగా విన్నారు. తాము ఉన్నామంటూ అండగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రతి కార్యక్రమంలో సూటిగా మంత్రిని, ముఖ్యమంత్రిని హరీశ్ రావు టార్గెట్ చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. సారీ చెప్పిన తర్వాత మరింతగా సమాచారం సేకరించి నియోజకవర్గాల్లో మీటింగ్‌లు పెట్టారు.
ఉప్పల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, పటాన్ చెరు ఇలా అనేక సభల్లో ప్రజలతోనే నేరుగా మాట్లాడించి ఉద్యమ రూపంలోకి మలిచారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇబ్బందులు తప్పవని అధికారులతో మీటింగ్‌లు పెట్టి మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఇద్దరు ఎమ్మార్వోలను, సబ్ రిజిస్ట్రాలను సస్పెండ్ చేశారు. అంతా అధికారులదే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, హరీశ్ రావు రోజూ ఏదో విధంగా షూట్ చేయడంతో ప్రజల్లో 22ఏ బలంగా నాటుకుపోయింది. మా భూమిని వీళ్లు కొట్టేస్తున్నారా అనేంత ఫీలింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది.
లేట్‌గా నిద్ర లేచిన బీజేపీ
ఎంపీ ఈటల రాజేందర్ ముమ్మరంగా మొదటి నుంచి ఈ సమస్యపై ఫైట్ చేశారు. కానీ, పార్టీ ఓన్ చేసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన 7 నియోజకవర్గాల్లో ఈ సమస్యతో చాలామంది కలిశారు. వినతి పత్రాలు ఇచ్చారు. కానీ, సింగిల్‌గా ఫైట్ చేసినా అది ప్రభుత్వ మెడలు వంచినట్లు మీడియాలో రాలేదు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినా పెద్దగా ప్రచారం కాలేదు. బీఆర్ఎస్ పోరును చూసి బీజేపీ లేట్‌గా నిద్ర లేచింది. ఈనెల 5న, మళ్లీ 7న దర్నా చౌక్ వద్ద నిరసనలు అని చెప్పడంతో ఒక్కరోజు వ్యవధిలో పెట్టడం, పార్టీ పోరు ప్రకటనలోనే క్లారిటీ లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












