సినిమా

Ravi Teja: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Ravi Teja: మాస్ మహారాజ్..తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అంతేకాదు, మునుపెన్నడూ లేని విధంగా తన మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మరీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో, వచ్చిన సాలీడ్ సక్సెస్ మైలేజ్‌ను మళ్ళీ మన మాస్ రాజా కంటిన్యూ చేయగలడా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి, కారణం ఇలా ప్రయోగం చేసే ప్రభాస్ గట్టిగా దెబ్బతిన్నాడు.

"సలార్" తర్వాత "రాజా సాబ్‌"తో ఫ్లాప్ చూసిన ప్రభాస్:

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలొచ్చాయి. ఈ మూడు సినిమాలు ఘోర పరాజయాన్ని చూశాయి. ఆ తర్వాత వచ్చిన సలార్ అర్థం కాకపోయినా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల.. ప్రభాస్‌ను కొత్తగా చూపించడం వల్ల బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. అంత హెవీ యాక్షన్ సినిమా చేసిన ప్రభాస్ సరదాగా ఓ చిన్న బడ్జెట్ సినిమాను కంప్లీట్ ఎంటర్‌టైనర్ జానర్‌లో చేయాలనుకున్నాడు. అదే 'ది రాజాసాబ్'. హర్రర్ అండ్ కామెడీ. కానీ, ఎలాంటి దెబ్బ తగిలిందో అందరికీ తెలిసిందే.

ప్రభాస్ రూట్‌లో రవితేజ!

ప్రభాస్ మాదిరిగానే రవితేజ కూడా 'ఇరుముడి' ఇండస్ట్రీ హిట్ తర్వాత కంప్లీట్ కామెడీ అండ్ హర్రర్ జానర్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేయనున్నాడు. 'సరిపోదా శనివారం' సినిమాతో ఫ్లాప్ చూశాడు వివేక్. అయినా, కూడా ఆయన చెప్పిన కథ-కథనాలు రవితేజను ఆకట్టుకున్నాయి. దాంతో ఓకే చెప్పాడు. అయితే, మన మాస్ రాజ ఎంటైర్ కెరీర్‌లో ఇలాంటి జానర్ సినిమాను చేయలేదు. తేడా కొడితే పెద్ద రిస్క్‌లో పడిపోతాడు.

ఇప్పటి నుంచి అదే ఫార్ములా!

రవితేజ గతంలో సినిమా ఫ్లాపైనా తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోలేదనే మాట వినిపించింది. కానీ, వరుస ఫ్లాప్స్ వల్ల 'ఇరుముడి' సినిమాను కొత్త కమిట్‌మెంట్‌తో చేశాడు. ఒకరకంగా ఇది కూడా పెద్ద రిస్కే. అయినా వర్కౌట్ అయింది. సినిమా పోతే రెమ్యునరేషన్ అక్కర్లేదు..హిట్ అయి లాభాలు వస్తే వాటా తీసుకునేలా నిర్మాతలతో ఒప్పదం చేసుకున్నాడట. దాంతో, ఇప్పుడు హ్యూజ్ సక్సెస్ కారణంగా రవితేజ రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ముట్టినట్టుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇకపై కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించాలని రవితేజ డిసైడయ్యాడట.

#raviteja#irumudi#prabhas#the rajasaab#vivek athreya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి