తెలంగాణ

Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర్యటన

రచన: NK3 నిమిషాల పఠనం

Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరు చేరుకుంటారు. అక్కడ భుత్వ డిగ్రీ కళాశాలను సందర్శిస్తారు. అలాగే నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం రేవంత్ తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్ చేరుకుంటారు. అక్కడ నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

సాయంత్రం 4.00 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి.. పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సీఎం రేవంత్ సమీక్షిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ లోని తన నివాసానికి బయలుదేరతారు. రాత్రికి కొడంగల్ లోనే బస చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

#Cm Revanth#Kodangal#Kodangal Tour#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి