తెలంగాణ

Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు-సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

రచన: NK5 నిమిషాల పఠనం

నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Cm Revanth: నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. అసదుద్దీన్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అసద్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దేశభక్తిలో ప్రధాని మోదీ, అమిత్ షాకు అసద్ తక్కువేమీ కాదన్నారు.

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వేగంగా వంతెన నిర్మాణం పూర్తి చేశామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీకి మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీనే ఒరిజినల్ సిటీ అన్నారు. తాను సీఎం అయ్యాక.. అక్బరుద్దీన్, అసదుద్దీన్ తో ఓల్డ్ సిటీ అభివృద్ధిపై చర్చించానని వెల్లడించారు.

ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం అసద్ భాయ్ ఏం చెప్పినా వెంటనే మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇన్నేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఓల్డ్ సిటీకి వచ్చారని రేవంత్ ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీలోకి నేను తప్ప ఇంకెవరూ రాలేదన్నారు. తన పెళ్లికి ముందు ఓల్డ్ సిటీలో గల్లీగల్లీ తిరిగానని రేవంత్ తెలిపారు.

https://www.facebook.com/reel/901497056087569

ఇదే కార్యక్రమంలో సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది చాలా దూకుడు స్వభావం అన్నారు. రేవంత్ దూకుడును ఆపమని కేసీఆర్ కి ముందే చెప్పాను.. ఆపకపోతే మీరందరూ ఇంటికే అని కూడా చెప్పా అని అసద్ అన్నారు. ''నేను బీఆర్ఎస్ వాళ్ల కి పదే పదే చెప్పాను. రేవంత్ దూకుడును కంట్రోల్ చేయండి.. లేదంటే మీరంతా ఇంట్లోనే కూర్చుంటారు'' అని చెప్పానని అసద్ తెలిపారు.

''రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోకపోతే ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని నేను కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తన దూకుడు స్వభావానికి భిన్నంగా చాలా సంయమనంతో ఉంటున్నారు. మిమ్మల్ని ఏది ఆపుతుందో నాకు తెలియదు. మళ్లీ మీ దూకుడును ప్రదర్శించండి, ప్రజల్లోకి రండి. ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు'' అని అసద్ అన్నారు.

https://x.com/rameshbairaboi1/status/2095558671950619125

#Cm Revanth Reddy#Old City#Hyderabad#Saidabad Steel Bridge#Asaduddin Owaisi#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి