The Paradise: మన తెలంగాణా సంసృతి, సాంప్రదాయాలకి ఇప్పుడు, ప్రతీ ప్రాంత ప్రజలు ఆకర్శితులవుతున్నారు. జానపద కాళారులు కోకొల్లలున్న రాష్ట్రం తెలంగాణ. ఫోక్ సాంగ్స్‌కి పెట్టింది పేరు. గత కొంతకాలం నుంచి తెలంగాణ నేపథ్యంలో సినిమాలు, పాటలు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా ఇతర దేశాలలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ తెలుగు చిత్ర పరిశ్రమలో అతివేగంగా 50 మిలియన్లకి పైగా వ్యాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్ఠించింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా.. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ లో నానితో కలిసి మాస్ స్టెప్స్ వేసింది. ఇటీవల వచ్చిన ఈ సాంగ్ రిలీజైన అతికొద్ది రోజుల్లోనే అత్యంత వేగంగా వ్యూస్ రాబట్టిన పాటగా కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది.

ఇక, ఈ సినిమాలో నాని జడల్ అనే వెరైటీ పాత్రలో నటించాడు. ప్యారడైజ్ ప్రాంతంలోని ఓ వర్గం సామాజికంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, అణగారితనానికి చెందిన పీరియాడిక్ కథాంశంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో..సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ తీసుకొచ్చింది.
ఈ ఇటీవల వచ్చిన ‘ఏషనాగుల’ సాంగ్ కి ఆట సందీప్ మాస్టర్ ఆయన సతీమణి డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. జాంగిరెడ్డి, ప్రభ అద్భుతంగా పాడారు. కాగా, సెప్టంబర్ 24న 7 భాషలలో ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని, కెరీర్ లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందంటున్నారు. చూడాలి, మరి..ఈ సినిమా కోసం నానీ అన్నీ రకాలుగా చాలా కష్టపడ్డాడు.









