సినిమా

Prabhas-Fauzi: ఈ నెల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas-Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిపారు. దీనికోసం భారీ స్థాయిలో చార్మినార్ సెట్‌ని నిర్మించారు. దాదాపు, షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ నెల నుంచి వరుస అప్‌డేట్స్ రానున్నాయి.

ప్రస్తుతం, ప్రభాస్ చేస్తున్న సినిమాలలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ కాప్ స్టోరీగా రూపొందుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్-త్రిప్తి ల ఫస్ట్ లుక్ ఊహించని విధంగా క్రేజ్‌ని తీసుకువచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పాత్రకి పూర్తి భిన్నంగా ఫౌజీలో పాత్ర ఉండబోతోంది. ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. ఫౌజీ నుంచి వచ్చిన ప్రభాస్ లుక్ కూడా సెన్షేషన్‌ని క్రియేట్ చేసింది.

ఇలా, రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు, రెండు విభిన్నమైన పాత్రలు..రెండు సినిమాల కోసం ప్రభాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతో ఎగ్జైట్ చేస్తాయని అంటున్నారు. ఈ సినిమాల కోసం ఫిజికల్‌గా కూడా ప్రభాస్ చాలా శ్రమిస్తున్నాడు. ఒక్క ఫౌజీ కోసం దాదాపు నెల రోజుల పాటు డేట్స్ కేటాయించి డే అండ్ నైట్ షూట్స్‌లో పాల్గొన్నాడట. దీనికి, కారణం అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకోవడమే.

ఈ ఏడాది డిసెంబర్ 3న భారీ స్థాయిలో పాన్ ఇండియా భాషలలో ఫౌజీని రిలీజ్ చేయనున్నారు. అందుకే, నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరుపుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనూ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశారు. అయితే, ప్రభాస్ సినిమాకి గతంలో వచ్చిన కంప్లైంట్స్ అప్‌డేట్స్ విషయంలోనే. కానీ, మైత్రీ వారూ ఫౌజీ విషయంలో అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల నుంచి వరుసగా అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఒక్కో అప్‌డేట్స్ సినిమా రేంజ్‌ను అంచెలంచెలుగా పెంచుతుందని నిర్మాత ధిమాను వ్యక్తం చేశాడు. మరి, ఆ అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

#prabhas#fauzi#imanvi#hanu raghavapudi#mythri movie makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి