సినిమా

RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..

రచన: Anshu4 నిమిషాల పఠనం

పెద్ది తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమా త్వరలో మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, అదెప్పుడు అనేది ఇన్నాళ్ళు ఓ క్లారిటీ మాత్రం లేదు. చరణ్ కెరీర్‌లో నటించబోతున్న 17వ సినిమా ఇది. ఆర్సీ 17గా ప్రస్తుతం పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా వచ్చిన కన్‌ఫర్మేషన్ ప్రకారం దసరా పండుగ రోజు (అక్టోబర్ 20న) ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవబోతోంది.

రంగస్థలం కాంబోపై భారీ అంచనాలు:

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం సుకుమార్, చరణ్. వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ కమర్షియల్ సక్సెస్‌తో ఊహించని లాభాలను మూటగట్టుకున్నారు మైత్రీ వారు. ఆ తర్వాతనే వారు దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మైత్రీ వారితో సుకుమార్, చరణ్ కలిసి మూవీ చేబోతున్నారు.

అక్టోబర్ 20న ప్రారంభం:

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న సుకుమార్-రామ్ చరణ్-మైత్రీ వారి సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మైత్రీ నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి అధికారికంగా ప్రకటించారు. ఇక, ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిదిగా రానున్నట్టు తెలుస్తోంది. ఇదే, రోజు సినిమాలో నటించే ప్రధాన పాత్రలు, టెక్నీషియన్స్ ని వెల్లడించనున్నారట.

ఆర్ఆర్ఆర్ తర్వార చరణ్ చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. గేమ్ ఛేంజర్ సినిమా అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పెద్ది సినిమాకి మొదట బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ, ఫుల్ రన్ లో మాత్రం సినిమా అనుకున్నంత హిట్ టాక్ ని తెచ్చుకోలేకపోయింది. కానీ, చరణ్ రోల్స్ కి మాత్రం విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అవార్డ్స్ గ్యారెంటీ అంటున్నారు.

#rc 17#ram charan#sukumar#mythri movie makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి