సినిమా

Trivikram: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలలో పేరుకు రెండో హీరోయిన్ ఉంటుంది. కానీ, ఆమెకి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని ఇప్పటికే చాలా సినిమాలలో ప్రూవ్ అయింది. సెకండ్ లీడ్ అని చెప్పే హీరోయిన్‌కి అసలు గురూజీ సినిమా వల్ల ఆశించిన సక్సెస్ గానీ, అవకాశాలు గానీ దక్కడం లేదు. కానీ, ఆయన మాత్రం పేరున్న హీరోయిన్‌నే తీసుకుంటున్నాడు.

Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలలో పేరుకు రెండో హీరోయిన్ ఉంటుంది. కానీ, ఆమెకి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని ఇప్పటికే చాలా సినిమాలలో ప్రూవ్ అయింది. సెకండ్ లీడ్ అని చెప్పే హీరోయిన్‌కి అసలు గురూజీ సినిమా వల్ల ఆశించిన సక్సెస్ గానీ, అవకాశాలు గానీ దక్కడం లేదు. కానీ, ఆయన మాత్రం పేరున్న హీరోయిన్‌నే తీసుకుంటున్నాడు.

అలా, మోసపోయి ఏదో జరిగిపోతుందని ఆశపడి పెద్ద దర్శకుడు..పెద్ద హీరో..సెకండ్ హీరోయిన్‌గా అని సైన్ చేసిన వాళ్ళకి మొండిచెయ్యే కనిపిస్తుంది. కొందరైతే, త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ లీడ్ చేసి కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకున్నవాళ్ళూ ఉన్నారు. హీరో కోసం కూడా కొందరు సెకండ్ లీడ్ రోల్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ, వాళ్ళకి ఆ తర్వాత పెద్ద సినిమాలలో ఆఫర్స్ ఏమీ రాలేదు కూడా.

జల్సా లో పార్వతి మెల్టన్:

పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లీడ్ రోల్ లో నటించారు. ఒకరు పార్వతి మెల్టన్, ఇంకొకరు కమిలినీ ముఖర్జీ. వీరికి కూడా సినిమాలో ప్రాధాన్యం ఉంటుంది. పార్వతి రెండు పాటల్లో కూడా కనిపిస్తుంది. అలాగే, ఆనంద్ సినిమాతో డీసెంట్ హీరోయిన్‌గా పాపులర్ అయిన కమిలినీ కూడా జస్ట్ ఓ క్యారెక్టర్ మాత్రమే చేసింది.వీరిద్దరికీ జల్సా వల్ల వచ్చిందేమీ లేదు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోనూ నిత్యా మీనన్ సెకండ్ లీడ్ లో చేసింది. దీని వల్ల కూడా ఆమెకి ఏమీ ఉపయోగపడలేదు. అరవింద సమేత మూవీలో ఈషా రెబ్బాను సెకండ్ హీరోయిన్ అన్నారట. కానీ, పట్టుమని పది సీన్స్.. కనీసం ఒక్క సాంగ్ కూడా లేదు. ఇక, గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అని వార్తల్లో, ప్రమోషన్స్‌లో చెప్పారు. కానీ, ఆమె పరిస్థితి ఏదో చిన్న రోల్ కోసం తీసుకున్నట్టే తప్ప..అసలు ప్రధాన్యమే లేని పాత్ర చేసి ఊరుకుంది. అల వైకుంఠపురములో కూడా నివేదా పేతురాజ్ ఇలాంటి పాత్రనే చేసింది. అజ్ఞాతవాసి లోనూ అనూ ఇమ్మానియేల్ ఇలాంటి గెస్ట్ రోల్ చేసింది. మరి, ఎందుకు త్రివిక్రమ్ సెకండ్ లీడ్‌ని బలంగా సెకండ్ హీరోయిన్‌లా చూపించరో అర్థం కాదు.

#trivikram srinivas#jalsa#aravinda sametha veera raghava#ala vaikunthapuramulo
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి