వైరల్ న్యూస్

VIRAL: భార్య రోడ్డుపై పడిపోయినా.. బైక్ ఆపకుండా పారిపోయిన భర్త!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే తొందరలో ఓ భర్త తన భార్యను నడిరోడ్డుపైనే పడేసి పరారయ్యాడు. బైక్‌ను ఒక్కసారిగా వేగంగా మలుపు తిప్పడంతో వెనుక కూర్చున్న అతని భార్య బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం కనికరం చూపకుండా, భార్యను పట్టించుకోకుండా బైక్‌ను అలాగే పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు.

 పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే తొందరలో ఓ భర్త తన భార్యను నడిరోడ్డుపైనే పడేసి పరారయ్యాడు. బైక్‌ను ఒక్కసారిగా వేగంగా మలుపు తిప్పడంతో వెనుక కూర్చున్న అతని భార్య బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం కనికరం చూపకుండా, భార్యను పట్టించుకోకుండా బైక్‌ను అలాగే పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 రుద్రపూర్‌లోని త్రిశూల్ చౌక్ వద్ద శనివారం స్థానిక పోలీసులు రొటీన్ వాహన తనిఖీలు(Traffic Check) చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై వేగంగా అటుగా వచ్చాడు. పోలీసులను చూడగానే ట్రాఫిక్ చలానాలు పడతాయో లేక ఇతర తనిఖీల భయమో తెలియదు కానీ, ఎలాగైనా తప్పించుకోవాలని బైక్‌ను సడన్‌గా రివర్స్ చేయడానికి, మళ్లించడానికి ప్రయత్నించాడు. ఆ హడావుడిలో వెనుక కూర్చున్న మహిళ కిందపడిపోయింది.

 భార్య రోడ్డుపై విలవిలలాడుతున్నా భర్త పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అక్కడ గమనిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మానవత్వంతో కిందపడిన మహిళకు సాయం చేశారు. ఆమెకు నీళ్లు ఇచ్చి, ధైర్యం చెప్పడంతో పాటు ప్రథమ చికిత్స అందించారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందిస్తుండగా, భార్యను కాపాడుకోవాల్సిన భర్తే ఇలా ప్రాణాలను పణంగా పెట్టి పరారవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల భయం ప్రాణాలకంటే ఎక్కువైందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

#RudraputBikeIncident#TrafficChalanasFear#UttarakhandNews#ViralVideoPolice#HusbandRunsAway#SocialMediaViralNews#NationalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి