సినిమా

NTR-TRIVIKRAM: "గాడ్ ఆఫ్ వార్" గాలి వార్తేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NTR-TRIVIKRAM: టాలీవుడ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ముందు నుంచి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్‌గా మార్కెట్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, అరవింద సమేత తర్వా మళ్ళీ ఇన్నేళ్ళకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మూవీ చేయనున్నాడు.

త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం, వెంకటేష్ హీరోగా ఆదర్శకుటుంబం సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దీని, తర్వాత తారక్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఇక, ఈ మూవీ త్రివిక్రమ్ పంథాలో సాగే కథ-కథనం, డైలాగ్స్‌తో రూపొందనుంది. అయితే, ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకు, తగ్గట్టుగానే ఇప్పుడు త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఈ మూవీ టైటిల్‌ ‘గాడ్ ఆఫ్ వార్’ అని ప్రచారం జరుగుతోంది. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు విన్నప్పటి నుంచి యుద్ధం, ప్రతీకారం, అధికారం, వీరత్వం వంటి అంశాలు గుర్తుకొస్తాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ టైటిల్‌కు తగ్గట్టుగా ఎన్టీఆర్‌ను శక్తివంతమైన పాత్రలో చూపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, ఈ టైటిల్ పెట్టడానికి కూడా కారణం సుబ్రమణ్య స్వామి కథాంశంతో తెరకెక్కబోతుండటమే.

అయితే, నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అవలేదని తేల్చి చెప్పాడు. కేవలం, సినిమాలో వచ్చే ఒక పోర్షన్ మాత్రమే అని..అందుకే, త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' అనే మాటను చెప్పారని తెలిపాడు. అంతేతప్ప, కనీసం ఈ పేరును ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించలేదని క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్‌గానే చూడాలి.

#NTR#Trivikram#Suryadevara Nagavamshi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి