తెలంగాణ

Telangana: తెలంగాణ పై కేంద్రం వరాల జల్లు.. 5 కొత్త రోప్‌వేలకు ఆమోదం!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో... తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జరిపిన ఉన్నత స్థాయి భేటీలో ఈ ప్రతిపాదనలకు తక్షణ ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోని ఐదు కొత్త రోప్‌వేల నిర్మాణానికి అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1,230 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు.. కేంద్రం నిర్ణయంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణం సులభతరం అవడమే కాకుండా.. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.

మరోవైపు న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో... తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జరిపిన ఉన్నత స్థాయి భేటీలో ఈ ప్రతిపాదనలకు తక్షణ ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇక యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, పెద్దపల్లి రామగిరి ఖిల్లా, నల్లగొండ హనుమాన్ హిల్, నిజామాబాద్ ఖిల్లా రామాలయం వద్ద ఈ ఐదు రోప్‌వే ప్రాజెక్టులు నిర్మించనున్నారు.

యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో పెద్దగుట్ట నుంచి టెంపుల్ సిటీ లేఅవుట్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు పరిశీలనలో ఉంది. అలాగే నాగార్జునకొండలో ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ వారసత్వ క్షేత్రం వద్ద కృష్ణా జలాలు, కొండల పైనుంచి కేబుల్ కార్లలో ప్రయాణించేలా రోప్‌వే సౌకర్యం కల్పిస్తారు. దీని వల్ల పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. ఇక పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని చారిత్రాత్మక రామగిరి ఖిల్లాపై కొండ పాదం నుంచి శిఖరం వరకు దాదాపు 2.1 కిలోమీటర్ల మేర ఈ రోప్‌వే నిర్మిస్తారు.

అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని హనుమాన్ హిల్‌పైకి 1.2 కిలోమీటర్ల రోప్‌వే రానుంది. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక ఖిల్లా రామాలయం వద్ద కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ రోప్‌వేల నిర్మాణంలో అటవీ భూములు దెబ్బతినకుండా, కాలుష్యం లేకుండా పర్యావరణహిత రవాణా సాధనాలుగా ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది..

#TelanganaTourism#ParvatmalaScheme#TelanganaRopeways#NitinGadkari#Yadagirigutta#NagarjunaKonda#TelanganaNews#TourismDevelopment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి