తెలంగాణ

TG : భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ టికెట్.. సిగ్గనిపిస్తలేదా? : హరీశ్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. పండుగల వేళ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ బస్సుల పేరిట చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. పండుగల వేళ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ బస్సుల పేరిట చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఇష్టానుసారం ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల్ని బాదుడేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా పండుగవేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.

రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం అన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ.230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని, మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ టికెట్‌ ఫేర్‌ను తన పోస్టులో జతపరిచారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ చార్జీలు డబుల్ చేసి జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు పెట్టి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని చెప్పారు. మహిళలకు ఫ్రీ జర్నీ అని చెప్పి పురుషుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్.. ఇలా చేస్తే మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? అని ప్రశ్నించారు.

గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆర్టీసీ టికెట్ చార్జీలను 5 సార్లు పెంచారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించరాు. రేవంత్ ప్రభుత్వం తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు చార్జీలను తగ్గించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

#harish rao#TGSRTC#dobule charge#BRS#dussera#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి