సినిమా

Vijay Devarakonda: ఫ్లాప్ సినిమాపై సెన్షేషనల్ కామెంట్స్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Vijay Devarakonda: మన హీరోలు, దర్శక నిర్మాతలు కొన్ని సందర్భాలలో సినిమా ఫ్లాప్ అన్న టాక్ వచ్చిన తర్వాత కూడా..కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అని..టాప్ టెన్ చిత్రాలలో ఇది ఫలనా నంబర్‌లో ఉంటుందని చెప్పుకొస్తుంటారు. అలా, చెప్పడం వెనక కారణాలు ఏంటనేవి స్పష్టంగా తెలియకపోయినా..అప్పటి బజ్ కోసమే అని మాత్రం తెలుస్తుంది. మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు రణబాలి సినిమా తన సినిమాలలో టాప్ 3లో ఉంటుందని అనడం ఆసక్తికరంగా మారింది.

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా రణబాలి. పీరియాడికల్ సినిమాగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 16న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది. అంతేకాదు, విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమా కావడం విశేషం.

కానీ, గత చిత్రాలు మాదిరిగానే ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. విజయ్‌కి ఈ కథ సూటవలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణబాలి చిత్రానికి డివైడ్ టాక్ రావడం, జైలర్ 2 హిట్ టాక్ రావడంతో దసరా హాలిడేస్ అయినా కూడా, విజయ్ సినిమాకి ఆదరణ తక్కువగా ఉంది.

అయినా కూడా, విజయ్ దేవరకొండ రణబాలి సినిమా గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే, ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకూ 14 సినిమాలు చేశానని అన్న విజయ్..రణబాలి టాప్ 3లో నిలుస్తుందని చెప్పడ కాస్త హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా విషయంలో కూడా రవితేజ గానీ, దర్శకుడు గానీ, నిర్మాతలు గానీ ఈ విధంగా చెప్పలేదు. కానీ, ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా విజయ్ తన రణబాలి సినిమా గురించి ఇలా చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు.

#Vijay Devarakonda#Ranabaali#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి