స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : ఖానామెట్ కబ్జారాయుళ్లు వీళ్లేనా?

రచన: Kumar••8 నిమిషాల పఠనం

చరిత్ర అందరికి తెలిసిందే.. ఇప్పుడు జరుగుతున్న కబ్జాలపై అప్రమత్తత అవసరం. ఖానామెట్‌లో 41 సర్వే నంబర్ ఏ.252.24 గుంటల వివాదాస్పద సమాచారం గూగుల్‌లో వెతికినా దొరుకుతుంది. అలాంటి లిటిగేషన్ భూముల్లో ఫేక్ పేపర్స్ సృష్టించి, నాయకుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు.

-బ్రదర్స్ పేరుతో బడా వ్యాపారం

-ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా?

-తూతూమంత్రంగానే హైడ్రా వ్యవహారం

- 2 ఎకరాల బౌండరీలతో బయటపడ్డ ముఠా తీరు?

- సర్వే నెంబర్ 1 నుంచి 68 వరకు అన్నీ ఫేక్, డబుల్ డాక్యుమెంట్స్?

- 2 లక్షల గజం భూమిని అమాయకులకు రూ.30 వేలకే అమ్మేస్తారు?

- ఆ డబ్బులతో పోలీస్, రెవెన్యూ అధికారులకు లంచాలిస్తారు?

- బడా నేతల పేర్లు వాడుకుని బాజాప్తాగా బౌండరీలు?

- ఆ తరువాత మరో 30 వేలకు గజం అంటూ వసూళ్లు!

- కోకాపేట జీఏఆర్ ఓనర్ గవ్వ అమరేంధర్ రెడ్డిగా బిల్డప్ ఇస్తున్న గోటూరి అమర్నాథ్ రెడ్డి

- దందాలకు జీఏఆర్ డెవలపర్‌గా ఫర్మ్ రిజిస్ట్రేషన్.. 50కి పైగా కేసులు!

- అరాచకాల విషయం తెలిస్తే కాళ్లబేరాలు!

- కొండల్ రెడ్డి అనుచరులం అంటూ నాగరాజు, మహేందర్, పాషా సుబానీల దందా!

- అమాయకుల వద్ద డబ్బుల వసూళ్లు.. ఎంతోమంది బాధితులు?

- ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలినా సెటిల్మెంట్స్ చేసుకోవాలంటూ ఒత్తిళ్లు?

- ప్రభుత్వ భూమిని కాపాడలేకపోతున్న హైడ్రా?

- కోర్టులో సైతం తప్పుడు డాక్యుమెంట్లు వేసి తప్పుదారి పట్టిస్తున్న వైనం

- ఖానామెట్ కబ్జాకోరులపై స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్ కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ చైర్మన్

చరిత్ర అందరికి తెలిసిందే.. ఇప్పుడు జరుగుతున్న కబ్జాలపై అప్రమత్తత అవసరం. ఖానామెట్‌లో 41 సర్వే నంబర్ ఏ.252.24 గుంటల వివాదాస్పద సమాచారం గూగుల్‌లో వెతికినా దొరుకుతుంది. అలాంటి లిటిగేషన్ భూముల్లో ఫేక్ పేపర్స్ సృష్టించి, నాయకుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలు చేసుకున్న వారికి మీ పొజిషన్ ఇక్కడ కాదు, అక్కడ అంటూ వేరే చోటకు వెళ్లి అక్కడ చుట్టూ బౌండరీలు కట్టేసుకుంటూ, నాలుగు ఐదు ముఠాలు తిరుగుతున్నాయి.

ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయితే, ఖైరతాబాద్ బీజీపీ నేత పల్లపు గోవర్ధన్‌తో పాటు గోపాలకృష్ణ వర్మరాజు, మక్బూల్ హమ్మద్, రవి నాయక్‌లపై కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత పొలిటికల్ సర్వేల పేర్లతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఫేక్ యూఎల్సీ, ఎల్ఆర్ఎస్ పత్రాలతో అనుమతులు తీసుకుని ఆరా మస్తాన్‌పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సీఎంసీ అధికారులే ఫిర్యాదు చేశారు.

తాజాగా 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు 41/13/ఏ అంటూ ఘర్ డెవలపర్స్ పేరు చెప్పుకుని దందాలకు పాల్పడుతున్నారు. ఆ సర్వే నెంబర్‌పై ఉన్న భూమి సప్లమెంటరీ సేత్వార్‌తో ఎప్పుడో భూమిని అమ్మేసుకున్నారు.ఇళ్ల నిర్మాణాలు కూడా అయిపోయాయి.కానీ, అదే భూమిని 2024లో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకుని మరో చోట ఉన్న 41/13 సర్వే నెంబర్‌లో చుట్టూ రేకులు పాతారు.అప్పటికే ప్రభుత్వానికి ప్లాట్ ఓనర్స్‌కి మధ్య సుప్రీంకోర్టు వరకు కేసు కోనసాగుతోంది ఇలాంటి భూమిలోకి బ్రదర్స్ పేరు చెప్పుకుని వెళ్లి రేకులు పాతారు.

పోలీస్ స్టేషన్‌లో గత నెల 29న ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఇక్కడ 9జీ పట్టాలంటూ, ఎక్స్ సర్వీస్ మెన్స్ పేరుతో అనేక ఫేక్ సర్టిఫికెట్స్ ఎప్పటి నుంచో పొజిషన్‌లో ఉండి కోర్టుల్లో కొట్లాడుతున్నారు.వాటినే టార్గెట్ చేసుకుని తక్కవకు అగ్రిమెంట్లు చేసుకుని, ధరణి, భూ భారతి అంటూ ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్స్ అయిన భూముల్లో మళ్లీ కొనుగోలు చేశామని కొత్త తెర లేపుతున్నారు.

ఎన్ని కథనాలు వచ్చినా ఆగని దందాలు

6 నెలల క్రితం రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమిని హైడ్రా కాపాడింది. బోర్డులు పెట్టింది. తాజాగా 4 వందల కోట్ల భూమిలో జీఏఆర్ అమరేందర్ రెడ్డి పేరుతో అమర్నాథ్ రెడ్డి కూడా ఇక్కడ పాగా వేశారు. వారం రోజుల క్రితం ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో హైడ్రా కళ్లు తెరిచి బోర్డులు పెట్టింది. కానీ, తెర వెనుక 1996 వరకు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నాయి.మళ్లీ ధరణిలో పట్టాదారుని కాలంలో పేర్లు కనిపిస్తున్నాయి. ఎవరికి భూమి అమ్మలేదని చెప్పుకుంటూ డబుల్ డాక్యుమెంట్స్‌తో పేట్రేగిపోతున్నారు.

ఖానామెట్ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలి

గతంలో అయ్యప్ప సోసైటీ ల్యాండ్స్‌పై సుప్రీంకోర్టు స్టేటస్ కో మెయింటెన్ చేయాలని అదేశించింది.కానీ,ఇష్టానుసారంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి.పొలిటీషియన్స్ బుట్ట రేణుక లాంటి వారు టాటా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్స్, స్కూల్స్, కన్వెన్షన్ సెంటర్స్‌తో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు 41 సర్వే నెంబర్స్‌లో రాజకీయ అండదండలతో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని క్లియర్ చేసుకుని ఏదో విధంగా కొట్టేయలని గద్దల్లా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ముఠాలు ఎన్నో ఖానామెట్‌పై వాలి బిజినెస్ చేసుకుంటున్నాయి. కోర్టు ఆదేశాలంటూ ఫేక్ యూఎల్సీలను, ఎల్ఆర్ఎస్‌లను సృష్టించి తప్పుదారి పట్టిస్తున్నాయి.అందుకే ఖానామెట్ కబ్జాలపై ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#khanamet lands#occupied#leaders#Congress#Telangana#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి