VenkeyAnil5: అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో 5వ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ‘బాల్రెడ్డి బామ్మర్ది’ అనే వెరైటీ టైటిల్‌ని పెట్టబోతున్నారట. ఇది, వినడానికి ఫన్‌గా ఉంది.
అనిల్ రావిపూడి సినిమాల మాదిరిగానే అందులో హీరో హీరోయిన్ సహా ఇతర పాత్రలు కూడా ఎంతో ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాయి. పటాస్ నుంచి అనిల్ రావిపూడి గత సినిమా మన శంకరవరప్రసాద్‌గారు వరకూ చూసుకున్నట్లైతే టైటిల్ ఫన్ తో పాటు మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజా ది గ్రేట్, ఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం..ఈ తరహాలో పెట్టినవే.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు..బాలయ్యతో చేసిన భవంత్ కేసరి కాస్త కథకు, హీరోల పాత్రలకి తగ్గట్టు పెట్టాడు అనిల్ రావిపూడి. ఇక, ఆయన దర్శకత్వంలో తెరక్కుతున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కీర్తి సురేష్ వెంకీ సరసన నటిస్తుండగా, కృతీ శెట్టి కళ్యాణ్ రామ్ కి జోడీగా కనిపించబోతోంది. సినిమా ఓపెనింగ్ రోజునుంచే అనిల్ తన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ పరిచయ టీజర్ దీనికి ఉదాహరణ. ఇక, ఈ సినిమాకి ‘బాల్రెడ్డి బామ్మర్ది’ అనే టైటిల్ ఎంతో క్యాచీగా ఉంది. దీనిని బట్టి చూస్తే వెంకీ-కళ్యాణ్ రామ్.. బావ-బావమరిది పాత్రల్లో అలరించనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, ఓ ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సారి సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్నారు అనిల్, వెంకీ. చూడాలి, మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో.


