Nidhhi Agerwal: హైదరాబాది అమ్మాయి అయిన నిధి అగర్వాల్ నటించబోతున్న లేటెస్ట్ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాలో తానే మేయిన్ లీడ్‌రోల్ చేస్తోంది. హీరో లేకుండా ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నాడు. ఇక, ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా ఫిక్సైయ్యాడు.
ఈ మధ్య కాలంలో నిధి అగర్వాల్ కి ఆశించిన విజయాలు దక్కలేదు. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టాలనుకున్న ఈ ఇస్మార్ట్ బ్యూటీకి గట్టి షాకే తగిలింది. అంతకముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా కూడా అంతే. పెద్ద హీరో, పెద్ద దర్శకుడు అని ఆశపడితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
దీంతో, ఇక..ఇప్పట్లో ఇస్మార్ట్ బ్యూటీకి సినిమా ఛాన్సులు రావని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఓ ఆసక్తికరమైన మైథాలజీ థ్రిల్లర్ మూవీలో తానే మేయిన్ లీడ్ రోల్ చేసే అవకాశం దక్కించుకుంది. కాగా, ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి.అశోక్, పి.రేణుక కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. హుర్మత్ సర్నా క్లాప్ కొట్టారు. అనంతరం, విడుదల చేసిన నిధి అగర్వాల్ అనౌన్స్‌మెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.
కథ బావుండాలే గానీ, మన సౌత్ లో చాలా మంది హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. థిల్లర్, సస్పెన్స్, హర్రర్, మర్డర్ మిస్టరీ మూవీస్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి మంచి సక్సెస్ ను తెచ్చిపెడతాయి. ప్రస్తుతం నిధికి అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ అవకాశాలు లేవు. ఇప్పుడు, ఈ సినిమాతో మళ్ళీ నిధి అగర్వాల్ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది.


