National

Ayodya : అయోధ్య విరాళాల చోరీ కేసు.. ట్రస్ట్ సభ్యులకు ‘సిట్’ క్లీన్‌చిట్!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో ఆలయ ట్రస్టు సభ్యులకు ఊరట లభించింది. విరాళాల చోరీ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్లింది. యూపీ ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ‘సిట్’ను ఏర్పాటు చేయగా.. ఆలయంలో హుండీ డబ్బులు లెక్కించే సిబ్బంది చేతివాటం ఉన్నట్టు అధికారులు విచారణలో తేల్చారు.

ఇందులో ఆలయ ట్రస్టు సభ్యుల ప్రమేయం ఎంతమేరకు ఉందని సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్‌చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ ఘటనలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ‘సిట్’ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.

ఆలయానికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దర్యాప్తు అధికారులు ట్రస్టు సభ్యులకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సమాచారం. దొంగిలించబడిన విరాళాలు , బ్యాంక్ లావాదేవీలకు ట్రస్ట్ ఉన్నతాధికారులతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని ‘సిట్’ అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖకు సిట్ తుది నివేదిక చేరినట్టు సమాచారం. తదుపరి చర్యల కోసం రామమందిర్‌ ట్రస్ట్‌కు దానిని అందజేనున్నట్టు తెలుస్తోంది.

విరాళాల లెక్కింపు గది నుంచి 70 సార్లు చోరీ జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ ప్రభుత్వానికి సమర్పించింది. కాగా, చోరీ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకున్నామని చంపత్ రాయ్ పేర్కొనడం గమనార్హం.

https://x.com/Telugufeedsite/status/2089587995708121541?s=20

#ayodya temple#donations robbery#SIT#trust members#cleanchit
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి