Mega 158: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులందరికీ పెద్ద పండుగ రోజే అని చెప్పాలి. కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక, కొత్త ప్రాజెక్ట్స్ కబుర్లు..షూటింగ్ దశలో ఉన్న సినిమాల అప్‌డేట్స్ సినీ ప్రముఖుల నుంచి వచ్చే స్పెషల్ బర్త్ డే విషెస్..ఇలా ఆరోజంతా మెగా డే అయిపోతుంది. ఈసారి కూడా అదే రిపీటవబోతోంది.
మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మెగా 158 (కరిది-అనుకుంటున్న టైటిల్) సినిమా నుంచి ఆగస్టు 22న, టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి అంతా రెడీ అయింది. ఆల్రెడీ చిరు, టీజర్ అండ్ టైటిల్ గురించి లీక్ చేసిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగా 158 టైటిల్ టీజర్‌ను ఏపీ, తెలంగాణాలలో నేరుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారట.
నిజంగా, ఇది మెగా అభిమానులకి మెగా బర్త్ డే గిఫ్ట్ అనుకోవాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తోంది. అనస్వర రాజన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, టీజర్‌కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినట్టుగా థమన్ మాటల్లో అర్థమైంది. బీజిఎం అంటే థమన్ ఏ రేంజ్‌లో బాదుతాడో అందరికీ తెలిసిందే.
మరి, మెగా 158 మూవీకి థమన్ ఏ స్థాయిలో మ్యూజిక్ ఇస్తున్నాడో చూడాలి. ఇప్పటి వరకూ బాలయ్య సినిమాలకి ఇచ్చిన బీజీఎం గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి బాగా చెప్పుకున్నారు. మరి, మెగా 158 గురించి మాట్లాడాలంటే థమన్ ఇచ్చే సాంగ్స్ గానీ, బీజీఎం గానీ అంతకుమించి ఉండాలి. అది, ఆగస్టు 22న తెలిసిపోతుంది.


