రేవంత్ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన శక్తి స్కీం పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీవిద్యార్థులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన శక్తి స్కీం వలన మూడు సంవత్సరాల సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ చేసిన తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలని నిబంధనం పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
శక్తి స్కీం ద్వారా సాంకేతిక విద్యా మండలి (SBTET) స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శ్రామిక శిక్షణగా మారుస్తున్నారంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఈ GO 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా.. నిరసనలు చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం తెలిపారు.
https://x.com/TeluguScribe/status/2089613364867870813?s=20
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద సైతం విద్యార్థుల ధర్నాకు దిగారు. అసలు ఎవరిని అడిగి ఈ స్కీం తెచ్చారు రేవంత్ రెడ్డి గారు? అంటూ ఓ విద్యార్థిని నిలదీసింది. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల డిప్లొమా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని,, పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తామని చెప్పడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు.
స్కిల్ యూనివర్సిటీ పరిధిలో ఎవ్వరికీ ఉద్యోగాలు రావని, ఈ విధానం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులోకి షిఫ్ట్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/2089610490163105845?s=20


