సినిమా

NBK 111: గోపీచంద్ మలినేనికి బాలయ్య ఫోన్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవల కాకినాడ ఫోర్ట్‌లో షూటింగ్ చేస్తుండగా గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యను హైదరాబాద్ తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం సర్జరీ జరిగింది. అయితే, బాలయ్య కనీసం రెండు నెలలైనా రెస్ట్ తీసుకోవాల్సి ఉందని డాక్టర్స్ సూచించారు. కానీ, కాస్త దెబ్బ తగ్గుముఖం పట్టిందట. దీంతో, NBK 111 యూనిట్‌కి బాలయ్య గుడ్ న్యూస్ చెప్పాడు.

గోపీచంద్ మలినేనికి స్వయంగా బాలయ్య ఫోన్ చేసి వచ్చే నెల నుంచి షెడ్యూల్‌లో జాయిన్ అవుతానని చెప్పాడట. అందుకు, తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేయమని, సెప్టెంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేద్దామని చెప్పాడట. వీలైనంత త్వరగా బాలయ్య పాల్గొనే సీన్స్ అలాగే, డబ్బింగ్ ని పూర్తి చేస్తానని చెప్పాడట.

ఇది, నందమూరి అభిమాలకి తెలిసి, బాలయ్యకి సినిమా పట్ల ఉన్న అంకితభావం గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ నోట్స్ తో కామెంట్స్ చేస్తున్నారట. ఇప్పుడే, కాదు..ఎప్పుడైనా ఇంతే. నిర్మాత శ్రేయస్సే ముఖ్యమని, నిర్మాత బావుంటే ఇంకో నాలుగు సినిమాలు తీస్తాడని బాలయ్య తన వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాడు. దీంతో, కాస్త అటు ఇటుగా అనుకున్న సమయానికి బాలయ్య, గోపీచంద్ మలినేనిల సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

డైలమాలో కొరటాల?

కొరటాల శివ కాంబినేషన్‌లో బాలయ్య తన 112వ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఆగస్టు నుంచి షూటింగ్ అనుకున్నారు. కానీ, బాలయ్యకి గాయం అవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ, గత నాలుగైదు రోజులుగా బడ్జెట్ కారణంగా బాలయ్య, ఈ సినిమాను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. దీంతో, కొరటాల మరో హీరోతో సినిమా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందని ప్రచారం జరిగింది. కాని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదట. గోపీచంద్ సినిమా అవగానే కొరటాల సినిమా పట్టాలెక్కిస్తాడని యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం.

#nbk111#balakrishna#gopichand malineni#nayanathara
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి