Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వృష కర్మ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. స్పర్శ్ శ్రీవాత్సవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను పౌరాణిక/అతీంద్రియ మిస్టరీగా తెరకెక్కిస్తున్నాడు.
సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ సంస్థలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే, ఈ సినిమా పూర్తయిన వెంటనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కే అవకాశం ఉందని తాజా సమాచారం.
వెంకీ అట్లూరి నితిన్ తో తీసిన రంగ్ దే ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ, ఆ తర్వాత ధనుష్ హీరోగా సార్ చిత్రాన్ని తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని తీసి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక, తాజాగా..కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో వరుసగా మూడవ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచనలం సృష్ఠించింది. సూర్య కెరీర్‌లో కూడా ఇంత తక్కువ రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. అయితే, నాగ చైతన్య ఇప్పుడు తన 25వ సినిమాను వెంకీ అట్లూరో చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. తన ల్యాండ్ మార్క్ మూవీకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చైతూ కూడా లవ్ స్టోరీ, తండేల్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. తనకి కూడా ల్యాండ్ మార్క్ మూవీ చాలా ప్రత్యేకం.


