NTR-TRIVIKRAM: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ప్రస్తుతం 'డ్రాగన్' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సిరీస్, 'సలార్' చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడిన తారక్ ఇటీవల సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమాను 2027, జూన్ 11వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్కేల్ లో రిలీజ్ కాబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎన్టీఆర్ సరసన కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఎన్టీఆర్ గాయం కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిందంటున్నారు. కానీ, ఇతర తారాగణంపై మిగతా టాకీ పార్ట్ ని ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రం రూపొందనుంది. ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగానూ ప్రకటించారు. త్రివిక్రమ్ అండ్ టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో హైప్ ఒక రేంజ్‌లో పెరిగింది. వాస్తవానికి, ఇదే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. కానీ, తారక్ వల్ల వచ్చే ఏడాది గానీ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయ్యేలా లేదు.
ఇదిలా ఉంటే, ఇన్నాళ్ళు ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమాకి టైటిల్ 'గాడ్ ఆఫ్ వార్' అని వార్తలు వచ్చాయి. దాదాపుగా అదే టైటిల్ కన్‌ఫర్మ్ అని అనుకున్నారు. కానీ, తాజాగా ఫిల్మ్ చాంబర్ లో మరో టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. అదే, 'దేవసేనాపతి'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ టైటిల్ కి ఈ టైటిల్ కి పూర్తి భిన్నంగా మేకర్స్ కథకి తగ్గ టైటిల్ పెట్టాలని దేవసేనాపతి అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట. ఎన్టీఆర్ అభిమానులకి కూడా ఈ టైటిల్ విపరీతంగా నచ్చిందని పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. మరి, ఫైనల్ గా ఏ టైటిల్ ని ప్రకటిస్తారో చూడాలి.


