తెలంగాణ

Cm Revanth: 2రోజుల్లో రిజిస్ట్రేషన్.. 22ఏ భూముల వివాదంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK•••3 నిమిషాల పఠనం

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

Cm Revanth: 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

''రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో ప‌రిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేయాలి. జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందించాలి. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాలి. ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి'' అని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వమని హామీ ఇచ్చారు. 22-ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని కోరారు. ఎటువంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు.

#Cm Revanth#Telangana#22A Lands#Prohibited Lands#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి