తెలంగాణ

Cm Revanth: విదేశీ పర్యటనకు సీఎం రేవంత్.. 11 రోజులు అక్కడే..

రచన: NK••3 నిమిషాల పఠనం

Cm Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా యూకే వెళ్లనున్నారు. ఆ తర్వాత అమెరికాలో పర్యటిస్తారు. మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ‌పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి సీఎం సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వంశీచందర్ రెడ్డిలు ఈ మీటింగ్ లో పాల్గొంటారు.

బుధవారం రాత్రి నుంచి సీఎం రేవంత్ ఫారిన్ టూర్ ప్రారంభం కానుంది. యూకే, యూఎస్ లలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుండి లండన్ కి పయనం అవుతారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లండన్ లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూతురి వివాహానికి తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్ హాజరవుతారు. 22న లండన్ బిజినెస్ స్కూల్ ను సందర్శిస్తారు.

24వ తేదీ వరకు లండన్ లోనే సీఎం రేవంత్ ఉండనున్నారు. 24వ తేదీ రాత్రికి లండన్ నుండి అమెరికాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ మీట్ అండ్ గ్రీట్ కు హాజరవుతారు. 30వ తేదీ వరకు కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలోనే ఉండనున్నారు. 11 రోజుల టూర్ అనంతరం సీఎం రేవంత్ ఆగస్టు 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

#Cm Revanth#Foreign Tour#USA#UK#Delhi#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి