సినిమా

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

రచన: Anshu••3 నిమిషాల పఠనం

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరి సినిమాల గురించి ఏదైనా వార్త గానీ, సినిమా అప్‌డేట్ గానీ వస్తే ఇట్టే వైరల్ అవుతుంది. అలాగే, అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారుతుంది.

ఇప్పుడు మెగా 158 గురించి కూడా అలాంటి చర్చే మొదలైంది. చిరంజీవికి ఇంతకముందు వాల్తేరు వీరయ లాంటి సాలీడ్ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ రూపొందిస్తున్న సినిమా మెగా 158. ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల మెగాస్టార్ రివీల్ చేశాడు. కదిరి తో మొదలవుతుంది. కదిరి లేదా కదిరి నరసింహా రెడ్డి..ఈ రెండిట్లో ఒకటి ఫిక్స్ అని కూడా చెప్పుకుంటున్నారు.

ఇక, తాజాగా మెగా 158 షూటింగ్ లో 40 రోజుల టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, యూనిట్ సభ్యులందరూ కలిసి చిరూతో ఉన్న పిక్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో, దర్శకుడు బాబి, చిరంజీవి, మేకర్స్, యూనిట్ ఉన్నారు. 40 రోజుల షూటింగ్ పూర్తైనట్టుగా మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు, ఈ 40 రోజుల పార్ట్ తో ఫస్టాఫ్ ని లాక్ చేశారట. ఇక, మిగిలింది సెకండాఫ్ మాత్రమే.

మెగా 158 లో చిరంజీవికి జంటగా జాతీయ ఉత్తమనటి అవార్డ్ అందుకున్న ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఆగస్టు 22న మెగా 158 నుంచి టీజర్ అండ్ టైటిల్ తో పాటు చిరు లుక్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక, తాజాగా వచ్చిన అప్‌డేట్‌తో మెగా అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

#mega158#mega158shooting update#chiranjeevi#bobbykolli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి