తెలంగాణ

22A Lands: 22ఏ, ధరణి, భూ భారతి బాధితుల సమావేశం.. ప్రధానంగా 4 తీర్మానాలు ప్రతిపాదన

రచన: NK••4 నిమిషాల పఠనం

22A Lands: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి బాధితుల సమావేశం విజయవంతమైంది. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.

రిటైర్డ్ కలెక్టర్ (మేడ్చల్) ఎంవీ రెడ్డి, దొంతు నర్సింహారెడ్డి, సాదిక్, రాంబాబు (రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్), రఫీ (ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మెంబర్), సురేశ్ రెడ్డి (రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్), బాలరాజు (రిటైర్డ్ తహశీల్దార్), సురేందర్ రెడ్డి (రిటైర్డ్ ఆర్మీ జవాన్), తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి, కె.కృష్ణారెడ్డి, స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా 4 తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ తీర్మానాలను స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల తెలియజేశారు.

4 తీర్మానాలు ప్రతిపాదన

1. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఏర్పాటు

రైతుల పక్షాన (రెవెన్యూ సమస్యలు, ఎల్ నినో ప్రభావంతో వచ్చే సమస్యలు, రైతు భూమి సమస్యలు) నిలబడేందుకు, గ్రామీణ ప్రజల తరపున అండగా ఉండేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడాలి. కలిసి వచ్చే అన్ని సంఘాలతో జాక్ గా ఏర్పడి ముందుకెళ్లాలని మొదటి తీర్మానం చేయడం జరిగింది.

2. ల్యాండ్ కమిషన్.. హైకోర్టు రిటైర్డ్ జడ్డిలతో ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు కట్టుబడి ఉండాలి.

3. టైటిల్ గ్యారెంటీ.. భూమి కొనుగోలు చేసినప్పుడు టైటిల్ గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకుని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ పథకాన్ని తెచ్చింది. హక్కులు గుర్తించి టైటిల్ గ్యారెంటీ ఇచ్చారు. ఇలాంటి టైటిల్ గ్యారెంటీ కచ్చితంగా తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలి.

4. అసైన్డ్ ల్యాండ్స్ రెగులరైజేషన్ చేసి అమ్ముకునే విధంగా బదలాయింపు హక్కులు ఇవ్వాలి.

#22A Lands#Dharani#Bhu Bharathi#22A#Land Victims#Hyderabad#Basheerbagh Press Club#Swechaa News#Telangana Samakhya#Ponguleti Srinivas Reddy#Cm Revanth Reddy#Prohibited Lands
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి