Irumudi: ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలు 3 గంటలకి పైగానే నిడివితో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 ఒక్క నిముషం తక్కువ 3 గంటలు. పుష్ప పార్ట్ 2, 3 గంటల 21 నిముషం నిడివితో వచ్చింది. సలార్ దాదాపు 3 గంటల నిడివితో వచ్చింది. ధురంధర్ 1, 3 గంటల 34 నిముషాలు, ధురంధర్ 2, 3 గంటల 49 నిముషాలు. ఇలా, దాదాపు 3 గంటలు, అంతకంటే ఎక్కువ రన్ టైమ్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
ఇక, మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఆగస్టు 21న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఒకవైపు సెన్సార్ కార్యక్రమాలు, ఇంకోవైపు రిలీజ్ కి సంబందించిన పనులను పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా 'ఇరుముడి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ని జారీ చేశారు. అంతేకాదు, ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల షాకింగ్ రన్‌టైమ్ తో రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో ఓ పెద్ద హీరో సినిమా ఇంత తక్కువ రన్‌టైమ్ తో వచ్చింది లేదు.

ఇరుముడి సినిమాను చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతీ ఒక్కరు చూసేలా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించాడు. ముఖ్యంగా సెన్సార్ రిపోర్ట్ ఈ సినిమాకి బలంగా చెప్పుకోవాలి. చాలా సినిమాలు ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడలేకపోతున్నారు. 18 ఏళ్ళ లోపు పిల్లలు చూసేలా ఈ మధ్య సినిమాలు రాలేదనే చెప్పాలి. అలాంటిది, మన మాస్ రాజా సినిమా మాత్రం అన్నీ వయసుల వాళ్ళు హాయిగా చూడొచ్చు.
ఇక, ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించింది. బేబీ నక్షత్ర కీలక పాత్రను పోషించింది. సాయి కుమార్ మరో కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే, సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కంప్లీట్ పాజిటివ్ టాక్‌ను తీసుకొచ్చింది. ఇంతకముందు వచ్చిన సినిమాలలో హీరోయిన్ గ్లామర్ ట్రీట్ ఉంది. మాస్ జాతర కూడా ఇలాంటి అందాల ఆరబోత ఉంది. గత చిత్రం భర్త మహాశయులకు విజప్తిలోనూ ఇద్దరు హీరోయిన్స్ అందాలరో హీటెక్కించారు. కానీ, ఇరుముడి మూవీలో మాత్రం ప్రియ భవానీ శంకర్ చాలా డీసెంట్‌గా కనిపిస్తోంది. ఇది కూడా సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం.


