క్రీడలు

2025 జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ 2025 ఏడాదికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను వెల్లడించింది. ప్రతిభావంతులైన 17మంది క్రీడాకారులను ఈసారి 'అర్జున' పురస్కారం వరించింది. చెస్ ప్రపంచకప్ విజేత దివ్యా దేశ్‌ముఖ్, డెకాథ్లాన్ ప్లేయర్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ స్టార్ గాయత్రి గోపీచంద్‌లతో పాటు గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ, షట్లర్ ట్రెస్సా జోలీ, బాక్సర్ నరేందర్ బెర్వాల్, రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఈ పురస్కారాల జాబితాలో నిలిచారు.

ఎంపిక కమిటీ తొలుత 24 మంది పేర్లను సిఫార్సు చేసినప్పటికీ, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కఠినమైన స్క్రీనింగ్ నిర్వహించారు. దాంతో ఈ పురస్కారాల ప్రకటన ఆరు నెలలు ఆలస్యమై కావలసిన 17 మందికి మాత్రమే ఆమోదం లభించింది. ఇక దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డుకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మాజీ ఫుట్‌బాలర్ ఐ. అరుమైనాయగంకు లైఫ్‌టైమ్ కేటగిరీలో అర్జున అవార్డు ప్రకటించారు.

శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాల్లో పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), చోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నందకుమార్ చవాన్ (షూటింగ్) రెగ్యులర్ విభాగంలో అవార్డులు అందుకోనున్నారు. ద్రోణాచార్య లైఫ్‌టైమ్ విభాగంలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ వీరేందర్ కుమార్‌లకు పురస్కారాలు దక్కాయి. ఈ పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలు ఈ అవార్డులను అందుకోనున్నారు. ఈ పురస్కారాల ఎంపిక కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.

గత నాలుగేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రదర్శించిన స్థిరమైన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తిని ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ సాగింది. జాతీయ క్రీడా అవార్డుల విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి, జ్ఞాపికను బహుకరిస్తారు. ఏటా అందించే ఈ అవార్డులు క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యమైనవి కాగా, దేశంలో క్రీడల అభివృద్ధికి, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవి ఎంతో దోహదపడతాయని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

#National Sports Awards 2025 India#Arjuna Awards 2025 Winners List#Divya Deshmukh Tejaswin Shankar Arjuna#Gayatri Gopichand Treesa Jolly Awards#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి