ఏపీ

తిరుమలలో వాహనాల పార్కింగ్ కొరత.. భక్తులకు తప్పని తిప్పలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తిరుమల కొండపై కొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో తరలివచ్చే భక్తుల తాకిడితో పాటు, అదే స్థాయిలో చేరుతున్న ప్రైవేట్ వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు కావడంతో పార్కింగ్ కొరత ఏర్పడుతోంది.

తిరుమల కొండపై కొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో తరలివచ్చే భక్తుల తాకిడితో పాటు, అదే స్థాయిలో చేరుతున్న ప్రైవేట్ వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు కావడంతో పార్కింగ్ కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం, ఘాట్ రోడ్డు ప్రమాదాలు టీటీడీ పరిపాలనా యంత్రాంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి.

ప్రస్తుతం తిరుమలలో ఉన్న 16పార్కింగ్ కేంద్రాల్లో కేవలం 6వేల నుంచి 7వేల వాహనాలను మాత్రమే నిలిపేందుకు వీలుంది. కానీ సాధారణ రోజుల్లో 10వేలకు పైగా, వారాంతాల్లో దాదాపు 14 వేల వాహనాలు కొండపైకి చేరుతున్నాయి. దర్శన నిరీక్షణ సమయం ఎక్కువవుతుండటంతో ప్రతిరోజూ దాదాపు 20వేల వాహనాలు తిరుమలలోనే నిలిచిపోతున్నాయి. దీంతో స్థలం లేక లేపాక్షి, బాలాజీ బస్టాండ్, నందకం, వరాహస్వామి గెస్ట్ హౌస్, మ్యూజియం ప్రాంతాల్లో రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాలను నిలుపుతుండటంతో పాదచారులు, సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఎకో-సెన్సిటివ్ గ్రీన్ బెల్ట్‌గా ఉండాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రంలో వాహన కాలుష్యం కోరలు చాస్తుండటం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. గతంలో ముళ్లగుంట, పీఏసీ ఐదు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పటికీ అవి ఆచరణకు నోచుకోలేదు. దీంతో కాలుష్య నివారణకు ఈ-బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు టీటీడీ చర్యలు వేగవంతం చేస్తోంది.

మరోవైపు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీల కోసం సిబ్బంది కొరత కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి దిగే మొదటి ఘాట్ రోడ్డులో నెలకు సగటున 10కి పైగా ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం కాగా టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిఘా పెంచాయి. అయినప్పటికీ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పర్యావరణాన్ని పరిరక్షించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#Tirumala Parking Issue 2026#TTD Vehicle Pollution Tirumala#Tirupati Alipiri Checkpost Traffic#Tirumala Ghat Road Accidents#TTD Electric Busses Tirumala#Tirumala Traffic News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి