తెలంగాణ

TG : రూ.111 కోట్లతో లీజుకు కొత్త హెలికాప్టర్.. సీఎం రేవంత్ తీరుపై విమర్శలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

22 ఏ నిషేధిత భూముల విషయంలో బద్నాం అయ్యామని అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ కొత్త హెలికాప్టర్‌లో సంచరించిన విషయం తెలిసిందే.

22 ఏ నిషేధిత భూముల విషయంలో బద్నాం అయ్యామని అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ కొత్త హెలికాప్టర్‌లో సంచరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని మీద కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న హెలికాప్టర్‌ను కాదని ట్విన్ ఇంజిన్స్ ఉన్న హెలికాప్టర్ కోసం సీఎం రేవంత్ రెండేండ్లకు గాను రూ. 111 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు లేవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని.. తనను కోసిన డబ్బులు రావని సీఎం మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోతే రూ.111 కోట్లు పెట్టి కొత్త హెలికాప్టర్ లీజుకు తీసుకుకోవడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు.

రూ.111 కోట్లు ఖర్చు చేస్తే కొత్త హెలికాప్టర్ వస్తుందని.. దానిని లీజుకు తీసుకోవడం ఎందుకు? అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.ప్రస్తుతం వాడుతున్న పాత హెలికాప్టర్‌కు ప్రభుత్వం నెలకు రూ.2 కోట్లు అద్దె చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక మీదట కొత్త హెలికాప్టర్‌కు రూ.5 కోట్లు చెల్లించేందుకు.. ఇలా రెండేళ్ల కాలానికి రూ.111 కోట్లు చెల్లించేందుకు రేవంత్ ప్రభుత్వం టెండర్ ఖరారు చేసినట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2089616529851810178?s=20

రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, ఖజానా ఖాళీ అంటూనే సీఎం రేవంత్ తన జల్సాల కోసం రూ.111 కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు వాడుతున్న అగస్టా-139 హెలికాప్టర్‌ను ఇకపై మంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. ట్విన్ ఇంజిన్ కలిగి ఉన్న ఎయిర్ బస్ హెచ్160 హెలికాప్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకునేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. అందుకోసం టెండర్ కూడా ఖరారు చేసినట్టు సమాచారం. కాగా, రేవంత్ నిర్ణయంపై ప్రతిపక్షపార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

https://x.com/Nallabalu1/status/2089526808383500470?s=20

#rs.111 crores#new helicopter#lease#cm revanth reddy#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి