ఏపీ

Ravan : వరుస అరెస్టులు, బెయిల్స్.. రావణ్‌పై UAPA యాక్ట్ కింద కేసు?

రచన: Desk 14 నిమిషాల పఠనం

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్..మీద వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్..మీద వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.దీంతో ప్రశ్న రావణ్ మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతుండగా.. పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఆయన కోర్టును ఆశ్రయించి ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ తెచ్చుకోగా.. ఐదోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇలా ఏపీలో అరెస్టులు, బెయిల్స్ పర్వం కొనసాగుతోంది.

ఇదిలాఉండగా, తనపై రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని రావణ్ తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు.అంతేకాకుండా, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రశ్నరావణ్ మీద తాజాగా పోలీసులు UAPA చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే దేశద్రోహం కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ కానుంది.ఉపా చట్టం కింద కేసు నేరుగా జైలులో పెట్టవచ్చు. ఆ చట్టానికి అన్ని పవర్స్ ఉంటాయి.

ఉపా (UAPA - Unlawful Activities Prevention Act) అనేది దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే చట్టవిరుద్ధమైన మరియు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ఒక కఠినమైన చట్టం.ఈ చట్టం కింద ఎవరైనా అరెస్ట్ అయితే పోలీసులు మరియు దర్యాప్తు సంస్థలకు ఈ క్రింది ప్రత్యేక అధికారాలు ఉంటాయి:

*వారెంట్ లేని అరెస్ట్ : కోర్టు వారెంట్ లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చు, వారి ఇళ్లలో సోదాలు జరపవచ్చు.

*దీర్ఘకాల కస్టడీ: సాధారణ కేసుల్లో 15 రోజుల పోలీస్ కస్టడీ ఉంటే, ఉపా కింద గరిష్టంగా 30 రోజుల వరకు కస్టడీకి అనుమతిస్తారు.

*చార్జ్‌షీట్‌కు ఎక్కువ సమయం: నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి పోలీసులకు సాధారణం కంటే ఎక్కువగా, 180 రోజుల (6 నెలలు) సమయం ఉంటుంది.

*ఆస్తుల జప్తు: ఉగ్రవాదానికి ఉపయోగించినట్లు అనుమానమున్న ఆస్తులను సీజ్ చేసే అధికారం ఉంటుంది.

*బెయిల్ కష్టం: ఈ చట్టం కింద మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని కోర్టు భావిస్తే నిందితుడికి బెయిల్ లభించడం చాలా కష్టం.

#Youtuber prashna ravan#arrest#uapa act#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి