మహిళల టీ20 ప్రపంచ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తుది సమరం ఉండనుంది. ఈ టోర్నీలో ఓటమి అనేది లేకుండా ఇరుజట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్‌లో గెలిచి వరల్డ్ కప్‌ను మరోసారి ముద్దాడాలని కంగారు జట్టు చూస్తున్నది. ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో 7 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు క్రియేట్ చేయనుంది. మరి ఆ జట్టు ఒత్తిడిని అధిగమించి ఫైనల్ లో సత్తా చాటుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉన్నది.
ఇదిలాఉంటే 17 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్ కప్‌ను అందుకోవాలని ఇంగ్లాండ్ ఉమెన్స్ టీం తమ వ్యూహాలకు పదును పెడుతోంది.ఇరు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. నేటి మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టే అధికంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా ప్రపంచ కప్ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే అధికంగా విజయం సాధించాయని ఎక్స్ పట్స్ చెబుతున్నారు. మరి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జట్టుదే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ అని చర్చ జరుగుతోంది.












