క్రైమ్

Vizag : వైజాగ్ సముద్రతీరంలో ఆరుగురి గల్లంతు..!

రచన: Desk 13 నిమిషాల పఠనం

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పలువురు విశాఖపట్నం సముద్రతీరంలో గల్లంతు అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆరుగురు మత్స్యకారులు గల్లంతు అయినట్టు సమాచారం.

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పలువురు విశాఖపట్నం సముద్రతీరంలో గల్లంతు అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆరుగురు మత్స్యకారులు గల్లంతు అయినట్టు సమాచారం. బోటులో వెళ్తున్న క్రమంలో అలల దాటికి వారంతా నీటిలో పడిపోయినట్టు తెలుస్తోంది.

గల్లంతైన బోటులో ఒకరు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. ఆయనను బోటు ఓనర్ చిన్నయ్యగా గుర్తించారు. నీటిలో మునిగిపోతున్న సమయంలో భారత నేవీ షిప్ సిబ్బంది ఆయన్ను కాపాడినట్టు తెలుస్తోంది. మొత్తం ఏడుగురిలో ఒకరు సేఫ్‌గా ఉండగా మిగతా గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు ఎక్కడైతే చేపల కోసం వేట కొనసాగించారో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

రెస్క్యూ ఆపరేషన్‌లో మెకనైస్డ్ బోట్స్ యూనియన్, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు.ఈ నెల 1న ఫిషింగ్ హార్డర్ నుంచి కుటుంబం వేటకు వెళ్లినట్టు తెలుస్తోంది. వేట పూర్తి చేసుకుని శనివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అవ్వగా..దారుణం చోటుచేసుకుంది.వారి సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ అవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారి ద్వారానే పోలీసులకు సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తోంది.

#fishermans#missing#vizag#coastal area#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి