సమంత నటించిన రీసెంట్ మూవీ మా ఇంటి బంగారం. రెండేళ్ళ తర్వాత సీక్వెల్ ఉంటుందని అంటున్నాడు సమంత భర్త రాజ్ నిడిమోరు. జూన్ 19వ తేదీన మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ బేబీ తర్వాత సమంత, దర్శకురాలు బి. వి. నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ, ప్రమోషనల్ కంటెంట్‌తోనే పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఇక, సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో బక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించగా, యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథను అందించి, నిర్మాణంలో భాగమైన రాజ్ ..మా ఇంటి బంగారం చిత్రానికి మరో రెండేళ్ళలో సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, ప్రధాన పాత్రలో నటించిన సమంతకి తన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించింది. ఇక, ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచలే, గౌతమి, శ్రీముఖి ఇతర ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే, మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ సమయంలో సమంత స్వయంగా.. తాను కొన్నాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాని చెప్తూ తన ప్రగ్నెన్సీని కన్‌ఫర్మ్ చేసింది.
దాంతో, మళ్ళీ సమంత సినిమాలకి చాలా ఏళ్ళే బ్రేక్ ఇస్తుందని మాట్లాడుకున్నారు. కానీ, రాజ్ అధికారికంగా మా ఇంటి బంగారం సీక్వెల్ ఉంటుందని వెల్లడించడంతో, పెద్దగా గ్యాప్ ఉండదని అర్థమవుతోంది. ఇక, నటనకి కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ నిర్మాతగా మాత్రం సినిమాలు నిర్మించేందుకు సమంత ప్లానింగ్‌లో ఉందని తెలుస్తోంది. మొత్తానికి గ్యాప్ వచ్చినప్పటికీ మంచి కంబ్యాక్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకుంది సమంత రాజ్.












