క్రైమ్

"ఆ పెళ్లి ఎప్పటికీ జరగదు".. సియా గోయల్ షాకింగ్ చాట్!

రచన: Desk 34 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు కీలకమైన స్నాప్‌చాట్ సందేశాలను స్వాధీనం చేసుకున్నారు.

  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన నిజాలు

  • పాత ఫోన్ నుంచి కీలక ఆధారాలు

  • స్నేహితురాలితో స్నాప్ చాట్‌లో వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు కీలకమైన స్నాప్‌చాట్ సందేశాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ముందే ఆమె చేసిన కొన్ని చాట్స్ ఇప్పుడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలుగా మారుతున్నాయి.

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ల ప్రకారం.. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు సియా గోయల్ తన స్నేహితురాలితో స్నాప్‌చాట్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి టిక్కెట్లు బుక్ చేయడానికి వీలుగా ఒక గుర్తింపు కార్డు, రెండు వైపుల ఫోటోలను పంపాలని సియా తన స్నేహితురాలిని కోరింది. "టికెట్ల బుకింగ్ కోసమే.. ఎలాగూ ఆ పెళ్లి జరగదు, అయినా సరే వివరాలు పంపించు" అంటూ ఆమె చాట్‌లో చెప్పింది.

లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయడే ఈ విషయాలను ధృవీకరించారు. మే నెలలో సియా తన స్నేహితురాలితో జరిపిన ఈ సంభాషణను ఆమె పాత మొబైల్ ఫోన్ నుండి రికవర్ చేసినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా సదరు స్నేహితురాలిని కూడా త్వరలోనే విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి లోయలో పడి కేతన్ అగర్వాల్ మరణించాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను లోయలోకి నెట్టి హత్య చేసి ఉంటుందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. తాజాగా లభించిన స్నాప్‌చాట్ ఆధారాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

#SiyaGoyal#KetanAgarwalCase#LohagadFortMurder#CrimeNews#TrendingNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి