ప్రపంచం

TRUMP : ఖమేనీ అంత్యక్రియలు.. ఒకే దెబ్బకు అందరినీ లేపేస్తా..! : ట్రంప్

రచన: Desk 13 నిమిషాల పఠనం

అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేని చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాతే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేని చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాతే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ సీజ్‌ఫైర్, పీస్ డీల్ కోసం ఒప్పందాలు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గాయి. అయితే, ప్రస్తుతం ఇరాన్ లో అలీఖమేనీ అంత్యక్రియలు, సంతాపదినాలను వారం పాటు నిర్వహించాలని ఆదేశం నిర్ణయించింది. దీంతో వేలాది జనాలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్ లీడర్లు, అధికారులు అంతా ఒకేచోటకు చేరుకున్నారు. వివిధ దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ఇరాన్‌ను హెచ్చరించారు. ‘మేం అనుకుంటే ఖమేనీ అంత్యక్రియల సమయంలో అక్కడున్న నాయకులందరినీ ఒక్కదెబ్బతో చంపేస్తాం. కానీ ఇపుడు అలా చేయం. అలా చేస్తే తమతో చర్చలు జరపడానికి ఎవరూ ఉండరు. అందుకే వారిని వదిలేశాం’ అని కామెంట్స్ చేశారు. ఆ దేశంలోని మిగిలిన నాయకత్వాన్ని నిర్మూలించగలనని.. కానీ అలా చేయాలని తాను అనుకోవట్లేదని వెల్లడించారు.

అంతేకాకుండా, ఖమేనీ అంత్యక్రియల్లో వేలాది మంది ఇరానియన్లు కన్నీరు పెట్టుకోవడంపై ట్రంప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని తాను ఇంతకాలం అనుకున్నట్టు తెలిపారు. తాను అనుకున్నదే నిజమై ఉండొచ్చని, అంత్యక్రియల సమయంలో ప్రజలు మొసలి కన్నీరు కారుస్తున్నారని సైతం వ్యంగ్యంగా స్పందించారు.

#Trump#iran#ali khameni funeral#international
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి