బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. కేజీఎఫ్ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్టు రాబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ కన్ఫర్మ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ చేస్తారని కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ మరో కొత్త విషయం ఏంటేంటే.. పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈమూవీలో హృతిక్ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించొచ్చని స్ట్రాంగ్ బజ్. ఒకటి మాస్, ఇంకొకటి స్టైలిష్ అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును హోంబలే ఫిలిమ్స్ రూ.300cr భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హృతిక్ రోషన్ బాలీవుడ్ డైరెక్టర్లను కాదని, ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించిన పరశురామ్‌ను నమ్మి తన డేట్స్ ఎలా ఇచ్చాడని, అసలు ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుంది? అంటూ నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హృతిక్ ఫ్యాన్స్, బీటౌన్ క్రిటిక్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.












