నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి ఏరియాలో 800 ఎకరాల కబ్జాలు జరుగుతున్నా ఏ ఒక్క మీడియాకు పట్టింపు లేదు.కోర్టులో విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన రాయరు. పిటిషనర్లు అన్ని రాజకీయ పార్టీల బడా నేతల వద్దకు తిరిగినా కనికరించరు.ప్రభుత్వ పెద్దలను కలిసినా ‘మావాళ్లేనా’ అంటూ దాటివేత చేశారు. అధికారులను అడ్డుకోవాలని వేడుకున్నా ‘పెద్దలతో పెట్టుకోలేము’ అంటూ కప్పగంతులు వేశారు. కానీ ఏ ఒక్క రోజు కూడా 80 వేల కోట్ల భూ స్కాంపై కన్నెత్తి చూడలేదు. బిజినెస్ చేసుకుంటున్న ఈ కంపెనీల విలువ ఈ రోజు రూ. 2 లక్షల కోట్ల దందా కంటే పైమాటే.దీనిపైనే పిటిషనర్ పనులు ఆపాలని కోరినా, తుది తీర్పుకు లోబడి ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి చెందుతుంది.లేదా ప్రైవేట్ వారికి వర్తిస్తుంది.ఆధారాలన్నీ 21 రోజుల్లో సమర్పించాలని హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ భూమిని కాపాడుతారా? లేదా అందరూ కలిసి కొట్టేస్తారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. దీనిపై స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్ కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది.
రూ.80వేల కోట్ల ఆస్తులపై జీపీ రెవెన్యూతోనే వాదనలా?
ప్రభుత్వ భూమి ఎకరం కబ్జా అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరైన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ 1100 ఎకరాల జీవోసీఎల్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంటే రెవెన్యూ జీపీ హాజరు అయ్యారని విమర్శలు ఉన్నాయి. అది కూడా అన్ని ఆధారాలు, పేపర్లు లేనందున టైం కోరడంతో కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. ప్రతివాదులకు కూడా ‘మీకు అమ్మిన వారు ఎప్పుడెప్పుడు డబ్బులు ప్రభుత్వ ట్రెజరీకి చెల్లించారో రసీదులతో రావాలి’ అని సూచించారు. రెవెన్యూ జీపీ మురళీధర్ రెడ్డిని అలినేషన్, అలాట్‌మెంట్, అక్వైర్డ్‌తో ఉన్న భూముల వివరణాత్మక కౌంటర్ వేయాలని ధర్మాసనం కోరింది.
1500 పేజీల్లో లేని కొనుగోలు పత్రాలు !
1962లో అయితే ఎకరం వెయ్యి రూపాయలు ఇవ్వాలని కోరిన రైతుల నుంచి ఈనాటి సెల్ సర్టిఫికెట్లు వెయ్యి రూపాయలకు ఇచ్చిన కలెక్టర్ల వరకు ఆర్టీఐ ద్వారా 1500 పత్రాల్లో జీవోలు, ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి కట్టినట్లు లేవు. ఎకరం రూ.500 కోసం కోర్టులో ఫైట్ చేసిన ఐడీఎల్ కంపెనీ వారసత్వం అయినా GOCL తిరిగి వెయ్యి కూడా చెల్లించకుండానే వందల ఎకరాలు కూకట్‌పల్లిలో దోచుకుంటున్న వైనంపై కోర్టులో పిటిషనర్ చింతల.. ఆర్టీఐ నుంచి తెప్పించిన 1500 పేజీలను సమర్పించారు.
స్టేపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము?
1962లో 05-05-1962న విడుదల చేసిన 717 జీవో ప్రకారం రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా 700 ఎకరాలు ఉంది.కానీ దానికి సర్వే నంబర్ లేకుండా చేశారని పూర్తి రికార్డులతో పిటిషనర్ తరపు న్యాయవాది పాశం కృష్ణరెడ్డి వాదనలు వినిపించారు. ఆనాడు ప్రభుత్వం ఐడీఎల్‌కి 200 ఎకరాలు కేటాయించింది. 152 ఎకరాలు అక్వైర్ చేశారు. ఖాస్రా పహాణీలో అదే సర్వే నంబర్ 1011/12 ప్రకారం 13.37 ఎకరాలు. ఇది ఒక్కటే ప్రభుత్వ భూమి. కానీ దీని పేరుతో కలిపేసుకున్నారు. 1012లో రంగదాముని చెరువు 3.14 గుంటలు ఉంది. కానీ మొత్తం 181 ఎకరాలుగా పహాణీల్లో కాలక్రమేణా ఎక్కించుకున్నారు. ధరణి మాటున రిజర్వ్డ్ ఫారెస్ట్ ల్యాండ్‌ను మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసింది. ఇలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించారు పిటిషనర్ చింతల శ్రీనివాస్ రెడ్డి. కానీ అటు ప్రభుత్వం వద్ద రికార్డులు లేవని, ఇటు ప్రతివాదులైన హానర్ హోమ్స్, ఫినిక్స్ సిస్టర్ సంస్థ వద్ద ప్రభుత్వానికి చెల్లించిన రసీదులు లేకపోవడంతో మూడు వారాలు వాయిదా వేసింది.












