ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్.. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం తాను ఉంటున్న హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన అనిరుధ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనిరుధ్ ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు ప్రస్తుత సమాజంలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కంటే.. సమస్యల నుండి దూరం అవడానికే ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాణాలు తీసుకోవడం వైపే యువత ఆసక్తి కనబరచడం పై ఆందోళన కలిగిస్తుంది.
సమస్య ఏదైన చావు పరిష్కారం కాదనే ఆలోచన నేటి సమాజంలోని యువతలో లోపించడం విచారకరం..












