తీర్పుకు లోబడి ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో జీహెచ్ఎంసీ, రెరా, బ్యాంకులకు లేఖలు రాసిన పిటిషనర్ అడ్వకేట్ పాశం కృష్ణారెడ్డి. ఆర్టీఐ అప్లికేషన్స్‌లో రెండు కంపెనీలకే అనుమతులు అంటూ వివరణ ఇచ్చారని స్వేచ్ఛ న్యూస్ కి తెలియజేశారు. మార్కెట్‌లో మాత్రం అమ్మకానికి భారీ ప్రాజెక్ట్స్ అడ్వటైజింగ్ చేసుకుంటున్నాయని తెలిపారు. ఎవరూ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
- 800 ఎకరాల భూ స్కాంపై నోయిడా పద్దతిలో నష్టపరిహారం చెల్లించేలా చేస్తామని ప్రకటన
- స్కాం తీరుపై అన్ని సెంట్రల్ ఏజెన్సీలకు లేఖలు
రూ.80 వేల కోట్ల భూస్కాంని అడ్డుకోవడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న పిటిషనర్ శ్రీనివాస్ రెడ్డి చింతల.
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
కూకట్ పల్లి భూస్కాంలో మధ్యంతర ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పిటిషనర్ అడ్వకేట్ పాశం కృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీకి, హెచ్ఎండీఏకు అనుమతులపై ఆర్టీఐ కోరగా కేవలం 2 కంపెనీలకు విల్లా ప్రాజెక్ట్‌లో లక్ష స్క్వేర్ ఫీట్స్, మరో కంపెనీకి అపార్ట్‌మెంట్స్‌కి 1.20 లక్షలు స్క్వేర్ ఫీట్స్ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం ఇచ్చారు. కానీ ఇక్కడ కంపెనీలు భారీగానే నిర్మాణాలు చేపట్టేందుకు రెడీ అయ్యాయి. కొన్ని అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఈ భూములపై ఉన్న వివాదంపై అవగాహన కల్పించేందుకు ఆఫీసర్స్ అందరికీ పిటిషనర్ లాయర్ ఫిర్యాదులు చేస్తున్నారు. సొమవారం ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయనున్నారు. దీనికి తోడుగా పిటిషనర్ చింతల శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
నష్టం జరిగితే నోయిడా మాదిరి పరిష్కారం?
ఎవరైనా ప్లాట్ ఓనర్స్‌కి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో నోయిడా 7 వేల కోట్ల భవంతులకు నష్టం ఇచ్చినట్లే ఇవ్వాల్సి ఉంటుందని అడ్వకేట్ తెలిపారు. బ్యాంకులు టైటిల్ క్లియర్ లేకుండానే రుణాలు ఇవ్వవద్దని అన్ని బ్యాంకులకు లెటర్స్ ప్రిపేర్ చేశారు. స్కాం పై జాతీయ దర్యాప్తు సంస్థలకు, ఐఏఎస్‌ల తీరుపై డీవోపీటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 800 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నారు. స్టాక్ ఎక్సైజ్ కి జీఓసీఎల్ రాసిన లేఖలు.. వచ్చిన లాభాలు.. ఆ తర్వాత వెంటనే అమ్ముకుంటే మధ్యవర్తులకు వచ్చిన క్విడ్ ప్రో కో వ్యవహారాలు.. వందల కోట్ల వ్యత్యాసంపై పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారాలకు సమాచారం ఇవ్వనున్నారు












