- సోషల్ మీడియాలో కానరాని పాజిటివ్
- గత మూడు నెలల్లోనే భారీగా దెబ్బతిన్న నేషనల్ పార్టీ?
- నీట్ పేపర్ లీక్.. రామ జన్మభూమి నిధులు.. ఇథనల్ పెట్రోల్ వివాదాలు
- ప్రజల్లో మోడీకి ఉన్న క్రేజ్‌ని తగ్గించడంలో సోషల్ యాక్టివిస్ట్ సక్సెస్?
- ఇదే కొనసాగితే ప్లాన్ బీ అమలుకు సిద్ధం అవుతున్న ఎన్డీఏ?
- కొత్త చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రక్షళనకు ప్రణాళిక
- మూడు నెలలుగా తగ్గుతున్న బీజేపీ గ్రాఫ్‌పై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
పన్నేండేళ్ల పాటు రోజు రోజుకు బీజేపీకి పెరిగిన దేశ ప్రజల మద్దతు, ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. వరుసగా వివాదాల్లో మంత్రులు చిక్కుకోవడడం, జెన్ జీ జనరేషన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రచారం చేయడంతో స్కాంలు బయటపడుతున్నాయని అంటున్నారు. ఫలితంగా బీజేపీ గ్రాఫ్ దిగజారిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే కష్టమనే సంకేతాల నేపథ్యంలో ప్లాన్ బీ కి ఎన్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం.
కొంప ముంచుతున్న ఇథనాల్ పెట్రోల్
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ ప్రజలకు తెలియకుండానే అమలు చేయడంపై ఉద్యమంలా వారు విరుచుకుపడుతున్నారు. 2030కి ప్రవేశపెట్టాల్సిన పాలసీని గత ఏడాది 2025లోనే అమలులోకి తేవడం వివాదంగా మారింది. మైలేజ్ తగ్గడం, పెద్ద పెద్ద కార్ల ఇంజిన్లు డ్యామేజ్ కావడంతో 2జీ స్కాం కంటే పెద్దదిగా అభివర్ణించి, ప్రజల ముందు ఎండగట్టుతుండడం బీజేపీకి నష్టంగా మారింది. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ఈ20 ఇంకా ఆన్ గోయింగ్ పర్మిట్ అంటూనే 2027 వరకు ఏం చెప్పలేమని చెప్పడంతో ఆ మాటలు వైరల్‌గా మారాయి. ప్రతి వాహనదారుడు 10 శాతం మైలేజ్ తగ్గుతుందని చెప్పడంతో వాహనాలు పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయనే భయంలో ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని టీం భారత్ లాంటి యూత్ గ్రూప్ లు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమవుతున్నాయి. పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ప్రజలకు సమస్యపై వివరంగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. నితిన్ గడ్కరీ కుమారులు నిఖిల్, సారంగ్ గడ్కరీలు సియాన్ అగ్రో, మన్స్ ఇథనాల్ బిజినెస్ చేయడమే కారణమని నెటిజన్స్ నమ్మేలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ20 వాడడం మొదలు పెట్టిన తర్వాత రూ.89 కోట్లు ఉన్న నెట్ వర్త్ రూ.200 కోట్లకు చేరింది. ఈ పాలసీ బీజేపీ మంత్రులకే మేలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాన్పిక్ట్ ఆఫ్ ఇనట్రెస్ట్ అని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లోక్‌పాల్ దర్యాప్తు కోరింది. సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఈ కంపెనీలపై ఎందుకు జరగవు అంటూ ప్రశ్నిస్తుండడంతో బీజేపీకి గ్రామ స్థాయి నుంచి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ విధానం భారీగా లబ్ది చేకూరుతుందని వాదిస్తున్నా అది సామాన్య ప్రజలు నమ్మేలా లేదు.
ఇంటింటి ఇటుకల సెంటిమెంటే.. ఇప్పుడు గ్రాఫ్ డౌన్ కు కారణమా?
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు భక్తులు ఇచ్చిన విరాళాలు పక్కదారి పట్టడంపై జూన్ నెలలో వివాదం మొదలైంది. ట్రస్ట్ స్వయంగా ఫిర్యాదు చేయడంతో యూపీ ప్రభుత్వం ముగ్గురితో సిట్ ఏర్పాటు చేసింది. భక్తులు హుండీలో వేసిన బంగారం, డొనేషన్ బాక్సుల్లో వేసిన నగదు విలువైన వస్తువులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకుండా సిస్టమాటిక్‌గా దొంగిలించారు. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. 2025 కుంభమేళా సమయంలో విరాళాలు భారీగా పెరగడంతో అత్యధిక దొంగతనం జరిగిందని సిట్ తేల్చింది. 2015 నుంచి 2017 కాలంలో రూ.1,400 కోట్లు, క్వింటాళ్ల బంగారు ఇటుకలు దారి మళ్లించారని విమర్శలు ఉన్నాయి. మొత్తం రూ.5 వేల కోట్ల వరకు దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 8 నెలల సీసీ టీవీ ఫుటేజ్ నాశనం చేశారని తెలుస్తోంది. యోగా సెంటర్స్ లో, బాత్ రూంల్లో దాచిపెట్టినట్టు వార్తలు రావడం ఇండైరెక్ట్ గా బీజేపీకి నష్టం వాటిళ్లుతోంది. 125 మంది ఉద్యోగుల నియమకాల్లో జాబ్స్ ఫర్ క్యాచ్ రాకెట్ పై కూడా దృష్టి పెట్టారు. దీన్ని రాజకీయంగా వాడుకుంటున్న కాంగ్రెస్ సీబీఐ విచారణ, కాగ్ ఆడిటింగ్, సుప్రీంకోర్టు మానటరింగ్ జరపాలని డిమాండ్ చేస్తోంది. దీన్ని ఆర్ఎస్ఎస్ అత్యంత దురదృష్టకరం అని చెప్పినా ప్రజల్లోకి వెళ్లడం లేదు.
నీట్ పేపర్ లీక్ తో ఫుల్ డ్యామేజ్
మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో తర్వాత రద్దు చేశారు. మళ్లీ జూన్ 21న నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల ప్రభావితం అయ్యారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ దేశంలోనే అతి పెద్ద విద్యా స్కాంగా పేర్కొంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 83 సార్లు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి అని నివేదికలు చెబుతున్నాయి. రాజస్థాన్, కోచింగ్ హబ్ నుంచి మొదలైన లీకులు మహారాష్ట్రలోని మూడు ప్రాంతలకు వ్యాప్తించాయి. లీక్ అయిన పేపర్ ను రూ.25 లక్షల వరకు విక్రయించారని తల్లిదండ్రుల ఆరోపణలు ఉన్నాయి. ఇన్ సైడర్లు, ఫ్యానెల్ సభ్యులు కూడా పాల్గొన్నారని తేలింది. 11 మంది అరెస్ట్ అయ్యారు. పీవీ కులకర్ణి ప్యానెల్ లో ఉండడం లీక్ అయిన పేపర్లలో 120కి పైగా ప్రశ్నలు మ్యాచ్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ చేసిన డ్యామేజ్ బీజేపీకి భారీ నష్టాన్ని చేసింది. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించినా నమ్మకాన్ని మాత్రం తీసుకురాలేకపోయారు. దేశ వ్యాప్తంగా నిరసనలతో ప్రజలకు బీజేపీ చేసింది ఏమీ లేదు, భవిష్యత్తుని అంధకారం చేయడమే అంటూ వచ్చిన ఆరోపణలు నిజం అయ్యేలా స్కాంల వివాదాలు ముదురుతున్నాయి. వీటికి తోడుగా ఎస్ఐఆర్ కూడా ప్రజల్లో భయాందోళనను కలిగిస్తోంది. 2002 నుంచి లెక్కలోకి తీసుకోవడంపై అనేక సెంటిమెంట్ క్రియేట్ అవుతోంది. పర్సనల్ సమాచారం సరిగ్గా లేకుంటే తాము భారతీయులం కాదా అనే అనుమానం ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్లాన్ బీ.. బీజేపీ రెడీ?
గత ఎన్నికల్లోనే సొంతంగా సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు పునఃవిభజన ద్వారా నార్త్ లో మార్కులు కొట్టేయాలని చూశారు. జమిలీ ఎన్నికలు అంటూ ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఖర్చు పేరుతో పాగా వేయాలని చూసినట్లు ప్రజలు అనుమానించారు. వివిధ రాష్ట్రల్లో ఉన్న స్థానిక పార్టీలను ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అటు మిత్ర పక్షాలను, ప్రతిపక్షాలను ఒకే తాటిపై చూడడం బీజేపీకి మాత్రమే చెల్లు. ఇలా చాలా రాష్ట్రాల్లో మంచి పేరున్న లీడర్స్ ని గుర్తించి, వారిని పార్టీలోకి ఆహ్వానించడమా, మిత్రునిగా చేర్చుకోవడమా అనేది ప్లాన్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశంతో పావులు కదులుతున్నాయి. అయితే, ఈ డ్యామేజీలు ఇలానే కంటిన్యూ అయితే గడ్డుకాలం ఏర్పడే అవకాశం ఉంది












