బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. తన చిరకాల భాగస్వామి, బ్యూటీ అండ్ వెల్‌నెస్ వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఆదివారం (జూలై 5, 2026) వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ క్రమంలో ముంబైలోని అమీర్ ఖాన్ నివాసంలో వివాహ వేడుకల సందడి నెలకొంది.
సాధారణంగా బాలీవుడ్‌లో జరిగే ఆడంబరాల పెళ్లిళ్లకు భిన్నంగా, తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడే అమీర్ ఖాన్.. ఈ వేడుకను చాలా సింపుల్‌గా ప్లాన్ చేశారు. భారీ హంగూ ఆర్భాటాలు లేకుండా, ఇంట్లోనే అత్యంత సన్నిహితుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, పెళ్లి వేడుకల కోసం పాలీ హిల్‌లోని ఆయన విలాసవంతమైన నివాసాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమీర్ ఖాన్ ఉంటున్న ఫ్లోర్ బాల్కనీలు, కిటికీలను ఆకర్షణీయమైన ఫేరీ లైట్లతో ముస్తాబు చేశారు. అతి తక్కువ మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ఉన్న నేపథ్యంలో, వారికి తగినట్లుగా ఇంటి లోపల ప్రత్యేక డెకరేషన్, ఇతర ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












