క్రైమ్

మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్

రచన: NK2 నిమిషాల పఠనం

హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్ లు, ప్రైవేట్ వీడియోలతో ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

Harassment: హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్ లు, ప్రైవేట్ వీడియోలతో ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి వేధించాడని వాపోయింది. అంతేకాకుండా వీడియోలను తన భర్తకు పంపి బెదిరించాడని బాధితురాలి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తోటి ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనంగా మారింది.

#Harassment#Trainee IPS#Hyderabad#National Police Academy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి