క్రైమ్

మల్లంపేటలో మరోసారి నాటు తుపాకీ కలకలం.. అంగట్లో సరుకుల్లా లభ్యం

రచన: NK5 నిమిషాల పఠనం

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. మల్లంపేట శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అతడి రూమ్ ని చెక్ చేశారు. ఓ బ్యాగులో నాటు తుపాకీ కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Hanging: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. మల్లంపేట శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అతడి రూమ్ ని చెక్ చేశారు. ఓ బ్యాగులో నాటు తుపాకీ కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. అలాగే 3 లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ప్రణీత్ ప్రణవ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ ఉద్యోగి తోమటి వెంకట్రావుగా గుర్తించారు. తోమటి వెంకట్రావుది ఒంగోలుగా గుర్తించారు పోలీసులు. కుటుంబ కలహాల వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాగా, మృతుడి రూమ్ లో తుపాకీ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ తుపాకీ ఎవరిది? అతడికి ఎక్కడి నుంచి వచ్చింది? తుపాకీ దేని కోసం తెచ్చుకున్నాడు? ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

మృతుడి గదిలో నాటు తుపాకీ లభ్యం కావడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, మల్లంపేటలో చాలా మామూలుగానే నాటు తుపాకులు దొరుకుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం గాజులరామారంలో తుపాకీతో గాలిలో కాల్పులు జరిపిన ఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గాజులరామారంలోని ఎల్‌ఎన్‌ బార్‌ వద్ద గొడవ జరిగింది. ఓ విషయంలో బార్‌లో పనిచేసే సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో మల్లంపేటకు చెందిన రియల్టర్‌ నరేశ్‌ తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి నాటు తుపాకీతో గాలిలో 3 రౌండ్ల కాల్పులు జరపడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.

రియలర్టర్ నరేశ్‌ దగ్గర తుపాకీ ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ వ్యవహారంలో నరేశ్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వ్యక్తి అనుమతి లేని తుపాకీ వినియోగించడంతో పాటు కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

రియల్టర్‌ నరేశ్‌ భూతగాదాలు, ఇతర వ్యవహారాల్లో నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అతడికి బీహారీ గ్యాంగ్‌లతో సైతం పరిచయాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పర్మిషన్ లేకుండా నాటు తుపాకీ వాడాల్సిన అవసరం అతడికి ఏముంది? అనేది మిస్టరీగా మారింది.

ఇప్పుడు తాజాగా మరోసారి మల్లంపేట పేరు తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, అతడి రూమ్ లో నాటు తుపాకీ దొరకడం హాట్ టాపిక్ గా మారింది. అంగట్లో సరుకుల్లా మల్లంపేటలో మామూలుగానే నాటు తుపాకులు దొరుకుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

#Hanging#Dundigal#Sri Balaji Enclave#Country Made Gun
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి