సినిమా

Tollywood: రిలీజ్ రోజే సక్సెస్ సెలబ్రేషన్సా? ఇది మరీ ఎక్స్ట్రా!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Tollywood: సినిమా రిలీజ్ రోజే సక్సెస్ సెలబ్రేషన్ చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది కొన్ని సినిమాలకి మరీ టూమచ్‌గా అనిపిస్తోంది. అసలు, దేని ఆధారంగా సినిమా విడుదలైన రోజు ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్నారో జనాలకి అర్థం కావడం లేదు. నిజంగా, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకి సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తే ఒక అర్థం. అలా, కాకుండా కాస్త బడ్జెట్ పెట్టిన ప్రతీ సినిమాకి ఇలా చేయడం వల్ల జనాలలో చులకన భావం ఎక్కువవుతోంది.

ది ప్యారడైజ్:

ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ కి ముందు నుంచి కాస్త డివైడ్ టాక్ ఉన్న మాట వాస్తవం. అందుకే, ఈ సినిమాకి థియేట్రికల్ ట్రైలర్, ఇతర భాషల్లో పెద్ద ప్రమోషన్స్ గాని మేకర్స్ జరపలేదు. సినిమా విడుదలకి ముందు వారం రోజులు మాత్రం కాస్త హడావిడి కనిపించింది. కానీ, ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి సినిమా మీద డివైడ్ టాక్ స్పష్టంగా వినిపించింది. అయినా, ఇక్కడ సినిమా బ్లాక్ బస్టర్..అన్ని కోట్లు కలెక్షన్స్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ అంటూ ఊదరగొట్టారు. ఫైనల్‌గా మాత్రం దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకూ లాస్ అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంతే:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి అసలు ప్రమోషన్స్ అవరసం లేదనే చెప్పాలి. కానీ, కొత్త సినిమా కాబట్టి మేకర్స్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో రెట్టింపు ఆసక్తి..ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ జరుపుతున్నారు. అయితే, హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి తెలిసిన తర్వాత కూడా హిట్ అంటూ చేసిన సెలబ్రేషన్స్ మైనస్ అయ్యాయి.

రణబాలి:

తాజాగా, విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న నటించిన రణబాలి అనే పీరియాడికల్ సినిమా వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. కొందరికి నచ్చింది..ఇంకొందరికి నచ్చలేదు. రివ్యూస్ కూడా యావరేజ్ అని రాశాయి. అయినా, కూడా ఈ సినిమాకి గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు. ఇప్పుడు, ఇలా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసి..2 వారాల తర్వాత సినిమా నష్టాలను మిగిల్చిందని సైలెంట్ అయిపోతారు. ఈ అనవసరమైన పబ్లిసిటీ ఎందుకు? జనాలకి సినిమా నచ్చితే వాటంతట అవే కలెక్షన్స్ వస్తాయి..కొత్త రికార్డ్స్ నమోదవుతాయి.

#Success celebrations#Ranabaali#Vijay Devarakonda#Rashmika Mandanna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి